రోమాలు నిక్కబొడుచుకుంటాయే….!!
ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరేకొద్ది తీవ్ర ఉత్కంఠ క్రీడాభిమానుల్లో ఏర్పడుతుంది. ఇప్పటికే సెమిస్ బెర్త్ ఆస్ట్రేలియా ఖాయం చేసుకుంటే మిగిలిన మూడు బెర్త్ [more]
ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరేకొద్ది తీవ్ర ఉత్కంఠ క్రీడాభిమానుల్లో ఏర్పడుతుంది. ఇప్పటికే సెమిస్ బెర్త్ ఆస్ట్రేలియా ఖాయం చేసుకుంటే మిగిలిన మూడు బెర్త్ [more]
ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరేకొద్ది తీవ్ర ఉత్కంఠ క్రీడాభిమానుల్లో ఏర్పడుతుంది. ఇప్పటికే సెమిస్ బెర్త్ ఆస్ట్రేలియా ఖాయం చేసుకుంటే మిగిలిన మూడు బెర్త్ ల కోసం హోరాహోరీ పోరు నడిచే పరిస్థితి ఏర్పడింది. ఇంగ్లాండ్ ఓటమి పాలైతే తమ సెమిస్ ఆశలు సజీవంగా వుంటాయని భారత్ గెలుపుని కోరుకున్న పాకిస్థాన్ ఆశలపై ఓటమితో నీళ్ళు పోసేసింది టీం ఇండియా. ఇక ఇంగ్లాండ్ కు మరో మ్యాచ్ లో విజయం సాధిస్తే సెమిస్ బెర్త్ ఖాయం అవుతుంది. అయితే ఆ చివరి మ్యాచ్ న్యూజీలాండ్ తో కావడం ఆ ఫలితం సెమిస్ కు చేర్చే నిచ్చెన కావడంతో రెండు జట్ల నడుమ సాగే మ్యాచ్ హోరాహోరీ తధ్యమని క్రీడానిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత్ కి ఒక్క గెలుపు చాలు …
టీం ఇండియా ప్రపంచ కప్ టోర్నీలో తొలిసారి పరాజయం చెందినా సెమిస్ ఆశలు సజీవంగానే నిలుపుకుంది. ఇప్పటివరకు 11 పాయింట్ల తో ఇంకా రెండో స్థానంలో కొనసాగుతున్న టీం ఇండియా రన్ రేట్ లోను ఆస్ట్రేలియా తరువాత దూసుకుపోతుంది. శ్రీలంక, బాంగ్లాదేశ్ లలో ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు సెమీఫైనల్ కి కోహ్లీ సేన చేరుకుంటుంది. ఇక మూడో స్థానంలో వున్న న్యూజిలాండ్, నాలుగో స్థానంలో వున్న ఇంగ్లాండ్ లకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఇద్దరి నడుమ జరగవలిసి వుంది. ఈ మ్యాచ్ లో ఏ టీం గెలిస్తే ఆ టీం సెమీఫైనల్ కి చేరుకుంటుంది. ఓటమి పాలైన జట్టు కి మాత్రం పాకిస్తాన్, బంగ్లా దేశ్ ల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్స్ వుంది. దాంతో రాబోయే మ్యాచ్ లన్ని రోమాలు నిక్కబొడిచేలా చేస్తాయని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.