లాబీయింగ్ కు తలొగ్గితే అంతే?
కాంగ్రెస్ పార్టీ స్వయంకృతమే. అధిష్టానం ఢిల్లీలో కూర్చుని నాయకత్వాన్ని నిర్ణయిస్తుండటంతో పార్టీ అనేక రాష్ట్రాల్లో ముఖ్య నేతలను కోల్పోయింది. మమత బెనర్జీ నుంచి హిమంత బిశ్వ శర్మ [more]
కాంగ్రెస్ పార్టీ స్వయంకృతమే. అధిష్టానం ఢిల్లీలో కూర్చుని నాయకత్వాన్ని నిర్ణయిస్తుండటంతో పార్టీ అనేక రాష్ట్రాల్లో ముఖ్య నేతలను కోల్పోయింది. మమత బెనర్జీ నుంచి హిమంత బిశ్వ శర్మ [more]
కాంగ్రెస్ పార్టీ స్వయంకృతమే. అధిష్టానం ఢిల్లీలో కూర్చుని నాయకత్వాన్ని నిర్ణయిస్తుండటంతో పార్టీ అనేక రాష్ట్రాల్లో ముఖ్య నేతలను కోల్పోయింది. మమత బెనర్జీ నుంచి హిమంత బిశ్వ శర్మ వరకూ కాంగ్రెస్ నుంచి రాజకీయాలు నేర్చుకున్న వారే. వారిని నిర్లక్ష్యం చేయడంతో సొంత పార్టీలు పెట్టుకుని కొందరు, ఇతర పార్టీలోకి వెళ్లి మరికొందరు ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారారు. కాంగ్రెస్ చేసిన తప్పిదాలే అన్ని రాష్ట్రాల్లో ఓటమికి గల కారణాలని చెప్పకతప్పదు.
ఎందరో నేతలను….
వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఎందరో నేతలను తయారు చేసింది. వారంతా స్థానికంగా బలమున్న వారే. వాగ్దాటి ఉన్న వారే. కాకుంటే అధిష్టానం కంటే రాష్ట్ర ప్రయోజనాలపైనే ఎక్కువ దృష్టిపెట్టేవారు. పశ్చిమ బెంగాల్ నుంచి అసోం వరకూ చూసుకుంటే కాంగ్రెస్ అనేక మంది అగ్రనేతలను చేజేతులా చేజార్చుకుంది. మమత బెనర్జీ కాంగ్రెస్ లో ఎదగాలని రాజకీయాల్లోకి వచ్చారు. చిన్న వయసులోనే అప్పట్లో బలంగా ఉన్న వామపక్షాలను ఎదిరించారు.
కాలు మోపేందుకు కూడా….
కానీ మమత బెనర్జీని అధినాయకత్వం ఇబ్బంది పెట్టడంతో ఆమె సొంత పార్టీ పెట్టుకున్నారు. ఈరోజు పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ కాలుమోపడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. ఇకఅసోంలో హిమంత బిశ్వశర్మ కాంగ్రెస్ నుంచి ఎదిగిన వారే. ఆయనకు మంచి వ్యూహకర్తగా పేరుంది. ఆయన సేవలను పార్టీ ఉపయోగించుకోలేకపోయింది. లాబీయింగ్ కు అధినాయకత్వం తలొగ్గడంతో ఆయన బీజేపీలో చేరిపోయారు.
వ్యూహకర్తలను, సత్తా ఉన్న వాళ్లను….
దీంతో అసోంలో హిమంత్ బిశ్వ శర్మ కారణంగానే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డిని కూడా కాంగ్రెస్ అకారణంగా దూరం పెట్టింది. ఆయనను అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టింది. దీంతో ఆయన సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ ఓటు బ్యాంకును తనతో తీసుకెళ్లారు. ఫలితంగా దశాబ్దకాలం నుంచి కాంగ్రెస్ అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. లాబీయింగ్ కంటే లోకల్ సత్తా చూడటంలో కాంగ్రెస్ విఫలమయినందునే ఈ దుస్థితి అని చెప్పక తప్పదు.