పుదుచ్చేరిలో పట్టు నిలుపుకుంటారా?
తమిళనాడు ఎన్నికలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పుదుచ్చేరి తొలి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. తమిళనాడులో ప్రాంతీయ [more]
తమిళనాడు ఎన్నికలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పుదుచ్చేరి తొలి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. తమిళనాడులో ప్రాంతీయ [more]
తమిళనాడు ఎన్నికలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పుదుచ్చేరి తొలి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు హవా ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ బలంగా ఉంది. ఎప్పుడూ ఇక్కడ కాంగ్రెస్ డీలా పడలేదు. ఇక్కడ కూడా డీఎంకే, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి పోట ీచేస్తూ వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది.
కాంగ్రెస్ కు పట్టున్న…..
పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం. ఇక్కడ 33 అసెంబ్లీ స్థానాలున్నాయి. 17 మ్యాజిక్ ఫిగర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధికంగా 14 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. డీఎంకే మూడు స్థానాల్లో గెలుచుకుంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక స్వతంత్ర సభ్యుడు కూడా వీరికి జత కలిశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి ఏర్పాటు చేసిన ఎఐఎన్ఆర్సి (ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్) ఏడు స్థానాలను గెలుచుకుంది.
గత ఎన్నికల్లోనూ….
గత అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో విజయం సాధించిన అన్నాడీఎంకే పుదుచ్చేరిలో మాత్రం నాలుగు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో మూడు స్థానాలను సాధించింది. అయితే గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ పుదుచ్చేరిలో ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా కిరణ్ బేడీ గవర్నర్ గా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారాయణస్వామి పాలనలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఈసారి బేడీ…..
రానున్న ఎన్నికల్లో పుదుచ్చేరిలో పాగా వేయాలనే బీజేపీ అధినాయకత్వం కిరణ్ బేడీని గవర్నర్ గా పంపంది. కిరణ్ బేడీ పార్టీతో పాటు తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. పుదుచ్చేరిలో బీజేపీ, అన్నాడీఎంకే కలసి పోటీ చేయనుంది. మరి ఈసారి కాంగ్రెస్ తన పట్టును పుదుచ్చేరిలో నిలుపుకుంటుందా? లేక అన్ని రాష్ట్రాల తరహాలోనే కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిని కూడా వదులుకుంటుందా? అన్నది చూడాల్సి ఉంది.