విసిగిస్తున్నారే… అందుకే వారు అలా?
ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధినాయకత్వం పట్టించుకోవడం లేదు. ఎంతమంది చెబుతున్నా వారి చెవికెక్కడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నాయకత్వ సమస్య పట్టుకుంది. పార్టీ అధినేత్రి సోనియగాంధీ [more]
ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధినాయకత్వం పట్టించుకోవడం లేదు. ఎంతమంది చెబుతున్నా వారి చెవికెక్కడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నాయకత్వ సమస్య పట్టుకుంది. పార్టీ అధినేత్రి సోనియగాంధీ [more]
ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధినాయకత్వం పట్టించుకోవడం లేదు. ఎంతమంది చెబుతున్నా వారి చెవికెక్కడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నాయకత్వ సమస్య పట్టుకుంది. పార్టీ అధినేత్రి సోనియగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నా అనారోగ్య కారణాలతో ఎక్కువ సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండా పోయారు. వివిధ రాష్ట్రాల్లోనూ పీసీీసీ ల నియామకం కూడా పెండింగ్ లో పడిపోయాయి. అంతేకాదు ఏదైనా సమస్య వచ్చినా చెప్పుకునేందుకు వినే నాయకుడు వారికి లేకపోవడంతో కాంగ్రెస్ లో ఒకరకమైన నిశ్శబ్ద వాతావరణం కన్పిస్తుంది.
ఎన్నికల్లో ఓటమికి…..
2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసి ఏడాది కావస్తుంది. అప్పడే కొత్త అధ్యక్షుడిని నియమించాలని టెన్ జన్ పథ్ భావించింది. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ తో సహా మరికొందరి పేర్లను సోనియా గాంధీ, రాహుల్ లు పరిశీలింాచారు. అయితే ప్రకటన వస్తుందనుకున్న తరుణంలో సీనియర్ నేతలు ఎంటర్ అయ్యారు.
బలవంతంగా ఒప్పించినా….
దీంతో సోనియాగాంధీపై వత్తిడి పెరిగింది. గాంధీ కుటుంబం మినహా మరెవ్వరూ ఆ పదవికి న్యాయం చేయలేరని సోనియాగాంధీని బలవంతంగా ఒప్పించారు. దీంతో అయిష్టంగానే పదవి చేపట్టినా ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ తిరిగి అధ్యక్ష్య పదవి చేపట్టాలని వత్తిడి తెచ్చారు. గతకొంతకాలంగా సీనియర్, జూనియర్ నేతలు రాహుల్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా ఆయన ససేమిరా అంటున్నారు. దీంతో కాంగ్రెస్ చుక్కాని లేని నావలా తయారయింది.
రాహుల్ రాకుంటే….?
మరోవైపు బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల్లో ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఆ యా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను, పొత్తు ఖరారు విషయంలో ఎటూ తేల్చకుండా ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతల్లోనూ ఆందోళన వ్యక్త మవుతోంది. దీంతో కొత్త అధ్యక్షుడు, పూర్తి కాలం నేత కాంగ్రెస్ కు రావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి శశిధరూర్ లాంటి నేతలు రాహుల్ అంగీకరించకుంటే మరొకరిని నియమించాలని వ్యాఖ్యానించడం విశేషం. ఎంత విసిగిపోయి ఉంటే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారో చెప్పకనే తెలుస్తోంది.