ఒకే ఒక్కటి.. దెబ్బ కొడుతుందా…?
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయా? అనుకున్న మేరకు సీట్లు, ఓట్లు సాధిస్తుందా? కాంగ్రెస్, జేడీఎస్ ల ను ధీటుగా ఎదుర్కొనగలదా? ఇదే అంశం [more]
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయా? అనుకున్న మేరకు సీట్లు, ఓట్లు సాధిస్తుందా? కాంగ్రెస్, జేడీఎస్ ల ను ధీటుగా ఎదుర్కొనగలదా? ఇదే అంశం [more]
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయా? అనుకున్న మేరకు సీట్లు, ఓట్లు సాధిస్తుందా? కాంగ్రెస్, జేడీఎస్ ల ను ధీటుగా ఎదుర్కొనగలదా? ఇదే అంశం ఇప్పుడు చర్చ జరుగుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికలు రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రతిష్టాత్మకమే. రాహుల్ ప్రధాని కావాలన్నా, మోదీ తిరిగి హస్తిన పీఠాన్ని అధిష్టించాలన్నా రెండు పార్టీలూ అత్యధిక సీట్లు సాధించాల్సిందే. విచిత్రమేమిటంటే దక్షిణాది రాష్ట్రాల్లో రెండు జాతీయ పార్టీలకూ పట్టున్న రాష్ట్రం కర్ణాటక మాత్రమే కావడం విశేషం. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా. వాటి దయాదాక్షిణ్యాల మీదనే ఇతరరాష్ట్రాల్లో ఈ రెండు జాతీయ పార్టీలూ ఆధారపడాల్సి ఉంటుంది.
రెండు పార్టీలూ బలంగా…..
ఒక్క కర్ణాటకలో మాత్రం పరిస్థితి వేరు. ఇక్కడ రెండు పార్టీలూ బలంగా ఉన్నాయి. కాంగ్రెైస్ రాష్ట్రంలో ఒకవిధంగా అధికారంలో ఉన్నట్లే లెక్క. జనతాదళ్ ఎస్ తో కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నా ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ మాత్రమే బరిలోకి దిగుతుంది. ఇక భారతీయ జనతా పార్టీది ఇక్కడ ఒంటరిపోరు. అయితే బలమైన ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీకి ప్లస్. రెండు పార్టీలూ తమ టార్గెట్ 23 స్థానాలుగా పెట్టుకున్నట్లు కన్పిస్తున్నాయి. మొత్తం 28 లోక్ సభ స్థానాలు కర్ణాటకలో ఉంటే అందులో సింహభాగం తాము సాధించాలని రెండు పార్టీలూ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.
లెక్కలు చూసుకుంటే…..
అయితే గత శాసనసభ ఎన్నికల్లో బలాబలాలను చూసుకుంటే బీజేపీకే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశముంది. గత ఎన్నికలలో 104 శాసనసభ స్థానాలు బీజేపీ ఖాతాలో పడ్డాయి. అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ కు ఎనిమిది స్థానాల దూరంలో ఆగిపోవడంతో అధికారానికి దూరమయింది. గత శాసనసభ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పదిహేను నుంచి పదహారు సీట్లు వచ్చే అవకాశముంది. అయితే ఇటీవల ఆపరేషన్ కమలం పేరుతో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప చేసిన వీరంగం ఆయనకు చెడ్డపేరు తెచ్చింది. ఫలితాలు రాగానే ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయడం, ఆ తర్వాత బలంనిరూపించుకోలేక దిగిపోవడం కొంత మైనస్ అని చెప్పాలి. ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిందంటున్నారు. మోదీ ఇమేజ్ కూడా తగ్గింది. దీంతో బీజేపీకి ఎక్కువ స్థానాలను దక్కించుకుంటుందా? లేదా? అన్నది మాత్రం కొంత సందేహంగానే ఉంది.
కలిస్తే మంచిదేనా?
ఇక కాంగ్రెస్, జేడీఎస్ లకు కలిపి పన్నెండు నుంచి పదమూడు స్థానాలు వచ్చే అవకాశముందని గత శాసనసభ ఎన్నికల ఫలితాలను బట్టి విశ్లేషించవచ్చు. అయితే గత శాసనసభ ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్ లు విడివిడిగా పోటీ చేశాయి. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కలసి పోటీ చేస్తుండటం కొంత కలసి వచ్చే అంశంగా కన్పిస్తుంది. సిద్ధరామయ్య తన సత్తాను చూపించుకోవాల్సి ఉంది. కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటయి దాదాపు తొమ్మిది నెలలు కావస్తున్నా ఆశించిన మేర అభివృద్ధి జరగలేదు. నిత్యం రెండు పార్టీల మధ్య విభేదాలను పరిష్కరించుకోవడానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తు న్నారన్న విమర్శలున్నాయి. దేవెగౌడ తో చర్చలు జరిపి సీట్ల సర్దుబాటు చేసుకోవాల్సి ుంది. ప్రజల్లో కూడా సంకీర్ణ సర్కార్ అంటేనే వెగటు పుట్టింది. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీలూ కలిసినా అనుకున్న స్థాయిలో సీట్లను సాధిస్తాయా? అన్నది కూడా అనుమానమే. మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాల్లో పట్టున్న ఏకైక రాష్ట్రం ఏ పార్టీకి అండగా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.
- Tags
- amith shah
- devegouda
- india
- indian national congress
- janatha dal s
- karnataka
- kumara swamy
- narendra modi
- rahul gandhi
- sidharamaiah
- yadurappa
- ఠమితౠషా
- à°à°°à±à°£à°¾à°à°
- à°à±à°®à°¾à°°à°¸à±à°µà°¾à°®à°¿
- à°à°¨à°¤à°¾à°¦à°³à± à°à°¸à±
- à°¦à±à°µà°à±à°¡
- నరà±à°à°¦à±à°° à°®à±à°¦à±
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤à°¦à±à°¶à°®à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾à°ªà°¾à°°à±à°à±
- యడà±à°¯à±à°°à°ªà±à°ª
- రాహà±à°²à± à°à°¾à°à°§à±
- సిదà±à°§à°°à°¾à°®à°¯à±à°¯