Congress : నేత మారినా.. రాత మారుతుందా?
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఇప్పుడు కోలుకునేలా లేదు. ఇలాగే ఉంటే మరో దశాబ్దమయినా ఇంతే. బీజేపీ కంటే బలహీనంగా ఏపీలో తయారైంది. దీనికి కారణం నేతలు తప్పు [more]
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఇప్పుడు కోలుకునేలా లేదు. ఇలాగే ఉంటే మరో దశాబ్దమయినా ఇంతే. బీజేపీ కంటే బలహీనంగా ఏపీలో తయారైంది. దీనికి కారణం నేతలు తప్పు [more]
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఇప్పుడు కోలుకునేలా లేదు. ఇలాగే ఉంటే మరో దశాబ్దమయినా ఇంతే. బీజేపీ కంటే బలహీనంగా ఏపీలో తయారైంది. దీనికి కారణం నేతలు తప్పు కాదు. రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ ను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికి ఏపీకి ఇద్దరు అధ్యక్షులు మారినా కాంగ్రెస్ బలపడింది లేదు. రఘువీరారెడ్డి 2014, 2019 ఎన్నికల్లో పార్టీ చీఫ్ గా ఉండి పరాజయం పాలవ్వడంతో రాజకీయాలకే దూరమయ్యారు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు సాకే శైలజానాధ్ వల్ల కూడా కావడం లేదు.
కుల ప్రభావం….
దీనికి కారణం బలమైన నాయకత్వం లేకపోవడమే అని చెప్పాలి. బలమైన సామాజికవర్గం నుంచి నేత వస్తేనే కొంతమేరకైనా పార్టీ పుంజుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏపీలో కుల ప్రభావం రాజకీయాలపై ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో సాకే శైలజానాధ్ స్థానంలో కొత్త నేత కోసం కాంగ్రెస్ అధినాయకత్వం కసరత్తులు చేస్తుంది. కొద్దిరోజుల్లోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశముంది.
తెలంగాణ మాదిరి….
పొరుగున ఉన్న తెలంగాణలో పార్టీ నాయకత్వ మార్పిడి జరిగిన తర్వాతనే అక్కడ పార్టీ పుంజుకుంది. రేవంత్ రెడ్డి నియమాకం తరహాలోనే ఇక్కడ కూడా వాయిస్ ఉన్న, జనంలో ఇమేజ్ ఉన్న నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తుంది. ఇందుకోసం పలువురి పేర్లను పరిశీలిస్తుంది. ప్రధానంగా ఏపీలో ప్రభావం చూపగలిగే కాపు, రెడ్డి సామాజికవర్గం నుంచి పీసీసీ చీఫ్ ను ఎంపిక చేయాలన్న యోచనలో ఉంది.
మార్పు తప్పదా?
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇప్పటికే కొందరి నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ను పరిశీలించినా, ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తానని ఆయన చెప్పినట్లు తెలిసింది. కాపు సామాజికవర్గం నుంచి పల్లంరాజు పేరును కూడా పరిశీలిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా పలువురి నేతల పేర్లు విన్పిస్తున్నాయి. మొత్తం మీద పార్టీలో జోష్ నింపడానికి, కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి రాబట్టుకోవడానికి చీఫ్ ను మార్చనున్నారన్నది ఖాయం.