కాంగ్రెస్ అవసరం దేశానికి ఉందిట…?
నిజమే కాంగ్రెస్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. అంతటి చరిత్ర ఉన్న పార్టీ దేశంలో మరోటి లేదు. కానీ కాంగ్రెస్ మాకు అవసరం లేదు గత రెండు ఎన్నికల [more]
నిజమే కాంగ్రెస్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. అంతటి చరిత్ర ఉన్న పార్టీ దేశంలో మరోటి లేదు. కానీ కాంగ్రెస్ మాకు అవసరం లేదు గత రెండు ఎన్నికల [more]
నిజమే కాంగ్రెస్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. అంతటి చరిత్ర ఉన్న పార్టీ దేశంలో మరోటి లేదు. కానీ కాంగ్రెస్ మాకు అవసరం లేదు గత రెండు ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలు చాటి చెప్పారు. ఇక దేశంలో కానీ తెలుగు రాష్ట్రాలో కానీ కాంగ్రెస్ ఎదుగుదల పెద్దగా లేదని తరచూ జరిగే సర్వేలు చెబుతూనే ఉన్నాయి. అలాంటి వేళ ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాకే శైలజానాధ్ అయితే చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆయన తాజాగా విశాఖ పర్యటనలో మాట్లాడుతూ ఈ దేశానికి కాంగ్రెస్ ఎంతో చేసింది. ఇంకా చేయాల్సి ఉంది. అందువల్ల కాంగ్రెస్ అవసరం దేశానికి ఎంతో ఉంది అన్నారు.
అది కదా చేయాలి….
ఎవరికైనా మన అవసరం ఉందని మనం అనుకుంటే సరిపోతుందా. అవతల వారికి తెలిసేలా మన పనితీరు ఉండాలి. ఏపీలోనే చూసుకుంటే గత ఏడేళ్ళుగా కాంగ్రెస్ తీరు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. నిజానికి కాంగ్రెస్ కి ఏపీలో ప్రతీ బూత్ లో ఒక్క ఓటు అయినా పడి తీరుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని బలోపేతం చేద్దామనే క్యాడరే లేరు. లీడర్లూ పెద్దగా కనిపించడంలేదు. మరి బీజేపీకి ఏపీలో ఏముందని ఆ పార్టీ నేతలు వీరంగం వేస్తున్నారు. వారి హడావుడిలో కొంత అయినా కాంగ్రెస్ చేస్తే ఆ పార్టీ ఇంకా ఉందని ఏపీ జనాలకు తెలుస్తుంది కదా అన్న సలహాలు శైలజానాధ్ కి వస్తున్నాయి.
విమర్శలతో సరి ….
శైలజానాధ్ మంత్రిగా ఏపీ జనాలకు కొంత వరకూ పరిచయమే. ఆయన తన పర్యటనల్లో మీడియా ముందుకు వచ్చి అన్ని పార్టీల మీద విమర్శలు చేస్తూ అంతటితో సరి అనిపిస్తున్నారు. కనీసం వెళ్ళిన చోట అయినా స్థానిక సమస్యల మీద ఆందోళనలు చేపట్టి ప్రజా గళం విప్పితే బాగుంటుంది. అంతే తప్ప టీడీపీ బీజేపీ, జనసేన, వైసీపీల మీద హాట్ కామెంట్స్ చేస్తే ప్రయోజనం ఏముందని అంటున్నారు. ఇక ఏపీలో ఇపుడున్న పరిస్థితుల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎదిగే అవకాశాలు ఉన్నాయన్న మాట అయితే ఉంది.
పట్టించుకోరా ..?
ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసింది అన్న కోపంతో రెండు ఎన్నికలతో జనాలు కాంగ్రెస్ ని భూస్థాపితం చేశారు. ఇక బీజేపీ తీరు చూస్తే ప్రత్యేక హోదా సైతం ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతోంది. అదే సమయంలో పోలవరం సహా అనేక ప్రాజెక్టుల మీద శీత కన్ను వేసింది. విభజన హామీలను తుంగలోకి తొక్కింది. కనీసం కాంగ్రెస్ తనతో కలసి వచ్చే కామ్రేడ్స్ ని దగ్గరకు తీసుకుని ఆయినా ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేస్తే బాగుంటుంది అన్న మాట అయితే ఉంది. మిగిలిన పార్టీలతో ఎటూ పొసగదు కాబట్టి తన ఉనికిని నిరూపించుకోవడానికి ఒక వేదికను అయినా నిర్మించుకోవాలని అంటున్నారు. అయితే కామ్రెడ్స్ కూడా టీడీపీ వైపే చూస్తున్నారు తప్ప కాంగ్రెస్ ని పట్టించుకోవడం లేదులా ఉంది. ఏది ఏమైనా ఏపీలో వైసీపీ తగ్గితే తమ బలం తిరిగి వెనక్కి వస్తుందని కాంగ్రెస్ అలా నక్కాశ పెట్టుకుని ఎదురుచూస్తోంది. తప్ప తగిన కార్యాచరణ లేకుండా పోయిందని విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్ అవసరం జనాలకు ఉందని ఉత్త మాటలు చెప్పకుండా గట్టి పనులకు ఖద్దరు నేతలు ఇప్పటికైనా పూనుకుంటారా అన్నదే చర్చ.