ఇక ఆ దేవుడే కాపాడాలి
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీలకూ షాకిచ్చాయనే చెప్పాలి. అనేక విచిత్రాలు ఈ ఎన్నికల్లో కన్పించాయి. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకోలేదని [more]
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీలకూ షాకిచ్చాయనే చెప్పాలి. అనేక విచిత్రాలు ఈ ఎన్నికల్లో కన్పించాయి. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకోలేదని [more]
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీలకూ షాకిచ్చాయనే చెప్పాలి. అనేక విచిత్రాలు ఈ ఎన్నికల్లో కన్పించాయి. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకోలేదని ఈ ఎన్నికల్లో మరోసారి స్పష్టమయింది. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో సాకే శైలజానాధ్ పార్టీని సరైన దిశగా నడిపించలేకపోయారు. ఒక్క వార్డులోనూ గెలుచుకోలేక కాంగ్రెస్ జీరో స్థానంలో ఉండిపోవాల్సి వచ్చింది.
ఏడేళ్లు కావస్తున్నా….
జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ రాష్ట్ర విభజన జరిగిన ఏడేళ్లు కావస్తున్నా ఇంకా కోలుకోలేదు. కమ్యునిస్టుల పాటి పనితీరును ప్రదర్శించలేదు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును, క్యాడర్ నంతా జగన్ పట్టుకుపోయారు. ఏడేళ్లవుతున్నా క్షేత్రస్థాయిలో పార్టీని పునర్నింంచే ప్రయత్నం జరగలేదు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కడా గెలవలేదు. కేవలం 0.62 వాతం ఓట్లను మాత్రమే కాంగ్రెస్ పార్టీ సాధించగలిగింది.
కమ్యునిస్టులు సయితం….
ఇక ఈ ఎన్నికల్లో కొద్దో గొప్పో కమ్యునిస్టులు రెండు స్థానాల్లో గెలుపొందారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం వారికి కలసొచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం లేకుంటే ఆ రెండు సీట్లు కూడా కమ్యునిస్టులకు దక్కేవి కావు. కానీ విశాఖ సిటీలో రెండు డివిజన్లను కమ్యునిస్టు పార్టీలు గెలుచుకోవడం ఆ పార్టీలకు ఊరట ఇచ్చే అంశమే. స్టీల్ ప్లాంట్ పరిధిలోని డివిజన్లలోనే వారు గెలవడం విశేషం. ఈ రెండు డివిజన్లు సాధించినంత మాత్రాన అప్పనంగా కామ్రేడ్లకు రాష్ట్రంలో బలం పెరిగినట్లు కాదు.
ఎంఐఎం బోణీ కొట్టినా…..
మున్సిపల్ ఎన్నికల్లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటేంటే.. ఎంఐఎం కూడా రెండు వార్డుల్లో గెలుపొందింది. హిందూపూర్ లోని రెండు డివిజన్లలో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు. విజయవాడ, గుంటూరు, కర్నూలు కార్పొరేషన్లలో ఎంఐఎం అభ్యర్థులు బరిలోకి దిగినా ఎక్కడా గెలవలేదు. అయితే కొన్ని చోట్ల బలమైన పోటీ ఇవ్వడంతో భవిష్యత్ లో ఏపీలో ఎంఐఎం నిలదొక్కుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పూర్తిగా నష్టపోయింది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పాలి. అందుకే సోషల్ మీడియాలో కాంగ్రెస్ కార్యకర్తలే నేతలను రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.