ముందుగానే క్యాంప్ కు… కాంగ్రెస్ నయా ఎత్తుగడ
కాంగ్రెస్ పార్టీ ఈసారి ముందుగానే తేరుకుంది. పోటీ చేసిన అభ్యర్థులను ముందుగానే క్యాంప్ లకు తరలించడం చర్చనీయాంశంగా మారింది. గోవా, హర్యానా వంటి చేదు అనుభవాల దృష్ట్యా [more]
కాంగ్రెస్ పార్టీ ఈసారి ముందుగానే తేరుకుంది. పోటీ చేసిన అభ్యర్థులను ముందుగానే క్యాంప్ లకు తరలించడం చర్చనీయాంశంగా మారింది. గోవా, హర్యానా వంటి చేదు అనుభవాల దృష్ట్యా [more]
కాంగ్రెస్ పార్టీ ఈసారి ముందుగానే తేరుకుంది. పోటీ చేసిన అభ్యర్థులను ముందుగానే క్యాంప్ లకు తరలించడం చర్చనీయాంశంగా మారింది. గోవా, హర్యానా వంటి చేదు అనుభవాల దృష్ట్యా ఈసారి కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చివరి నిమిషంలో తమ అభ్యర్థులను ఎత్తుకుపోతుందనే భయంతో కాంగ్రెస్ ఎన్నడూ లేని విధంగా ఇటువంటి ముందస్తు చర్యలకు దిగింది.
ప్రక్రియ పూర్తయినా…..
అసోంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ కూటములు పోటా పోటీ స్థానాలను సంపాదించుకుంటాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి పవర్ ను చేజిక్కించుకోవాలని అసోంలో శతవిధాలా ప్రయత్నాలు చేసింది. కాంగ్రెస్ కు బలమున్న ఈ ప్రాంతంలో రెండోసారి విజయం సాధించాలన్నది బీజేపీ పట్టుదల.
పోటా పోటీగా…..
అసోం గణపరిషత్ తోబీజేపీ బరిలోకి దిగింది. ఇక కాంగ్రెస్ సీపీఐ, సీపీఎం, బోడో పీపుల్స్ ఫ్రంట్, ఆలిండియా డెమొక్రటిక్ ఫ్రంట్ వంటి పార్టీలతో కలసి మహాకూటమిగా బరిలోకి దిగింది. 126 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఒపీనియన్ పోల్స్ చెప్పాయి. అదే సమయంలో కాంగ్రెస్ కూడా 60 స్థానాలకు పైగానే విజయం సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలకు దిగింది.
క్యాంప్ లోనే అభ్యర్థులు….
అసోంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయినా మే 2వ తేదీన ఫలితాలు వెలువడతాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థులను క్యాంపులకు తరలించింది. దాదాపు అరవై మందికిపైగానే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ జైపూర్ కు తరలించినట్లు తెలిసింది. వీరందరినీ మే 1వ తేదీ నాటికి అసోం తరలించాలని భావిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు కాంగ్రెస్ తన పార్టీ అభ్యర్థుతో పాటు మిత్రపక్షమైన ఆలిండియా డెమొక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థులను కూడా క్యాంప్ నకు తరలించడం విశేషం.