అది జరిగే పనేనా బ్రదరూ…?
గుజరాత్ లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కలలు కంటోంది. కర్ణాటకలో బీజేపీ మాదిరిగానే ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించాలని సిద్ధమయినట్లు కన్పిస్తుంది. కర్ణాటక తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రంపై [more]
గుజరాత్ లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కలలు కంటోంది. కర్ణాటకలో బీజేపీ మాదిరిగానే ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించాలని సిద్ధమయినట్లు కన్పిస్తుంది. కర్ణాటక తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రంపై [more]
గుజరాత్ లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కలలు కంటోంది. కర్ణాటకలో బీజేపీ మాదిరిగానే ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించాలని సిద్ధమయినట్లు కన్పిస్తుంది. కర్ణాటక తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రంపై బీజేపీ కన్నేసింది. అందుకు ప్రతిగానే గుజరాత్ ను తాము ఆధీనంలోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లుంది. కానీ ఆచరణలో అది సాధ్యం కానిదన్న విషయం అందరికీ తెలిసిందే అయినా కాంగ్రెస్ ప్రయత్నాన్ని మాత్రం అభినందించకుండా ఉండలేం.
ఉద్దండుల రాష్ట్రంలో…..
గుజరాత్ అంటే ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడి నుంచి వచ్చి రాజకీయంగా ఎదిగారు. ఈ ఇద్దరు ఇప్పుడు పార్టీలో కీలకంగా ఉన్నారు. అలాగే కేంద్రంలోనూ అధికారంలో ఉన్నారు. మరో నాలుగేళ్ల పాటు ఈ ఇద్దరికీ దేశంలో తిరుగుండదు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2022లో జరగనున్నాయి. అంటే కేవలం రెండేళ్లు మాత్రమే అధికారం ఉండనుంది. ఇంత తక్కువ సమయంలో ఆపరేషన్ ఆకర్ష్ సాధ్యమవుతుందా? అన్నదే ప్రశ్న.
గట్టి పోటీనే ఇచ్చినా…..
2017లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎదురొడ్డి పోరాడింది. ఒకరకంగా రాహుల్ గాంధీ మోదీకి చెమటలు పట్టించారంటే అతిశయోక్తి కాదు. గుజరాత్ లో రాహుల్ దూకుడును చూసి అప్పట్లో బీజేపీ భాగస్వామిగా ఉన్న శివసేన కూడా శభాష్ అనిందంటే చెప్పాల్సిన పనిలేదు. గుజరాత్ లో మొత్తం 182 స్థానాలున్నాయి. ఇందులో బీజేపీ 99 మాత్రమే గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 91 మాత్రమే కావడంతో బతికి బయటపడ గలిగింది. కాంగ్రెస్ కు 77 స్థానాలు దక్కించుకుని గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించుకుంది. తర్వాత కాంగ్రెస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ పంచన చేరారు.
రెండేళ్లు మాత్రమే…..
అయితే మధ్యప్రదేశ్ లో తమపై ప్రయోగిస్తున్న ఆకర్ష్ అస్త్రాన్ని కాంగ్రెస్ ఇక్కడ ఉపయోగించదలచుకున్నట్లుంది. గుజరాత్ ప్రస్తుత డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకువస్తే సీఎం పదవి ఇస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకటించడం చర్చనీయాంశమైంది. అయితే ఇరవై మంది ఎమ్మెల్యేలను ఆకర్షించే శక్తి లేక కాంగ్రెస్ ఆ పనిని బీజేపీ నేతకే అప్పగించందన్న సెటైర్లు కూడా వినపడుతున్నాయి. అయితే కేవలం రెండేళ్లు మాత్రమే అధికారం ఉన్న గుజరాత్ లో జంప్ లు ఉండవని కాంగ్రెస్ నేతలు సయితం అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తమ వారు చీలిపోకుండా ఉండేందుకే ఇలా కాంగ్రెస్ డ్రామాకు తెరదీసిందనే వారు కూడా లేకపోలేదు.