ఏం చేయలేమా? మమ్మీ… తొందరొద్దురా…. అబ్బీ
సహజంగా జాతీయ పార్టీ అంటే హైకమాండ్ నిర్ణయమై ఫైనల్. అయితే దరిద్రం దరిదాపుల్లోనే ఉన్నప్పుడు జాతీయ పార్టీ అయినా సరే రాష్ట్ర నాయకులకు తలవంచాల్సిందే. అదీ పూర్తిగా [more]
సహజంగా జాతీయ పార్టీ అంటే హైకమాండ్ నిర్ణయమై ఫైనల్. అయితే దరిద్రం దరిదాపుల్లోనే ఉన్నప్పుడు జాతీయ పార్టీ అయినా సరే రాష్ట్ర నాయకులకు తలవంచాల్సిందే. అదీ పూర్తిగా [more]
సహజంగా జాతీయ పార్టీ అంటే హైకమాండ్ నిర్ణయమై ఫైనల్. అయితే దరిద్రం దరిదాపుల్లోనే ఉన్నప్పుడు జాతీయ పార్టీ అయినా సరే రాష్ట్ర నాయకులకు తలవంచాల్సిందే. అదీ పూర్తిగా అధికారానికి దూరమయిన పార్టీ సంగతయితే చెప్పాల్సిన పనిలేదు. అధికారంలో ఉన్నంత వరకే హైకమాండ్ చెప్పినట్లు నడుస్తుంది. పవర్ లేకపోవతే జాతీయ పార్టీ అయినా సరే ప్రాంతీయ నాయకులకు సలాం అనాల్సిందే. ఈ పరిస్థితి ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ కు ఎదువుతుందని చెప్పాలి. గత కొన్ని నెలలుగా నిర్ణయాన్ని పెండింగ్ లో ఉంచుతూ నాన్చడానికి కారణం రాష్ట్ర స్థాయి నేతలే.
అధికారానికి దూరం కావడంతో….
కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయి ఆరేళ్లు కావాస్తుంది. వరసగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ నాయకత్వ బాధ్యతలను వదిలేయడం, సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించకపోవడం వంటి కారణాలతో ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు తాము బలంగా ఉన్న రాష్ట్రాల్లో, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సయితం స్వేచ్ఛగా నిర్ణయాలను కాంగ్రెస్ అధిష్టానం తీసుకోలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ నేతల మధ్య విభేదాలు తలెత్తితే అసలుకే ఎసరొస్తుందనే భయం కావచ్చు.
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్…
కర్ణాటకలో నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ అధికారంలో ఉండేది. అయితే కాంగ్రెస్ లో విభేదాల కారణంగానే అది అధికారానికి దూరమయింది. అయినా ఇప్పటికీ కాంగ్రెస్ కర్ణాటకలో బలంగానే ఉంది. ట్రై చేస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే వీలుంది. అయితే ఇక్కడ కొన్ని నెలలుగా పీసీసీ అధ్యక్ష పదవిని కాంగ్రెస్ నాయకత్వం భర్తీ చేయలేకపోతుంది. ఇందుకు కారణం డీకే శివకుమార్ అభ్యర్థిత్వాన్ని సీనియర్ నేత సిద్ధరామయ్య వ్యతిరేకించడమే. డీకే శివకుమార్ పేరు పీసీసీ చీఫ్ గా ఖరారయినప్పటికీ ప్రకటించే ధైర్యం చేయలేకపోతుంది. అందరికీ నచ్చ చెప్పిన తర్వాతనే ప్రకటించాలన్న ఉద్దేశ్యంతో ఉంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్ లోనూ….
ఇక మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక్కడ కూడా పీసీసీ అధ్యక్షుడి పేరును కాంగ్రెస్ ప్రకటించలేదు. ఇక్కడ ముఖ్యమంత్రి కమల్ నాధ్, యువనేత జ్యోతిరాదిత్య సింధియాల మధ్య కొన్నాళ్లుగా వార్ నడుస్తోంది. అసలే కొనఊపిరితో ఉన్న సర్కార్ తేడా వస్తే కూలిపోతుంది. జ్యోతిరాదిత్య సింధియా పీసీసీ చీఫ్ గా నియమించితే ఒప్పుకునేది లేదని కమల్ నాధ్, దిగ్విజయ్ సింగ్ లు వార్నింగ్ లు పంపుతున్నారు. సింధియా సయితం కాంగ్రెస్ కు పరోక్షంగా ఝలక్ లు ఇస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పీసీసీ చీఫ్ పదవిని భర్తీ చేయలేదు. దీంతో పాటు రాజస్థాన్ పీసీపీ చీఫ్ పదవికి కూడా నియామకం జరగాల్సి ఉంది. ఇలా ప్రతి రాష్ట్రంలో నేతలను సంతృప్తి పర్చలేక, గ్రూపు విభేదాలను పరిష్కరించలేక కాంగ్రెస్ అధిష్టానం సతమతమవుతోంది. అందుకే అంటారు అధికారంలో ఉంటేనే ఎవరైనా మాట వింటారు.. లేకుంటే… ఆ వైపు కూడా చూడరన్న సామెత టెన్ జన్ పథ్ కు ఖచ్చితంగా సరిపోతుంది. ఆ మూడు రాష్ట్రాలు కాంగ్రెస్ హైకమాండ్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.