ఇంత ఇగో అవసరమా తల్లీ?
కాంగ్రెస్ కు శత్రువులు ఎవరూ ఉండరు. వారికి వారే శత్రువులు. మరోసారి మధ్యప్రదేశ్ లో ఈ విషయం రుజువైంది. చాలా ఏళ్ల తర్వాత అందిన అధికారాన్ని నిలుపుకోవడంలో [more]
కాంగ్రెస్ కు శత్రువులు ఎవరూ ఉండరు. వారికి వారే శత్రువులు. మరోసారి మధ్యప్రదేశ్ లో ఈ విషయం రుజువైంది. చాలా ఏళ్ల తర్వాత అందిన అధికారాన్ని నిలుపుకోవడంలో [more]
కాంగ్రెస్ కు శత్రువులు ఎవరూ ఉండరు. వారికి వారే శత్రువులు. మరోసారి మధ్యప్రదేశ్ లో ఈ విషయం రుజువైంది. చాలా ఏళ్ల తర్వాత అందిన అధికారాన్ని నిలుపుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమయింది. ఈ నెపాన్ని బీజేపీపై నెట్టేకన్నా స్వయంకృతాపరాధమే కారణమని చెప్పక తప్పదు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కుప్ప కూలిపోతే దానికి కారణం ఆ పార్టీయే తప్ప మరెవ్వరూ కాదన్నది సుస్పష్టం.
అన్నీ తెలిసినా…..
జ్యోతిరాదిత్య సింధియా వెంట ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని కాంగ్రెస్ హైకమాండ్ కు తెలియదా? ముఖ్యమంత్రిగా ఉన్న కమల్ నాధ్ కంటికి కనపడలేదా? ఇవీ సగటు కాంగ్రెస్ అభిమాని నుంచి వస్తున్న ప్రశ్నలు. కేవలం పదిహేను నెలల క్రితమే కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. దాదాపు పన్నెండు నెలల నుంచి కాంగ్రెస్ లో అగ్గిరాజుకుంటోంది. జ్యోతిరాదిత్య సింధియా, కమల్ నాధ్ ల మధ్య పొసగడం లేదన్న విషయం తెలుసు. దిగ్విజయ్ సింగ్ పుల్లలు పెడుతున్నారని అందరికీ తెలిసిందే.
ఆయనతో మాట్లాడేందుకు….
అయితే జ్యోతిరాదిత్య సింధియాను ఏ మాత్రం బుజ్జగించే చర్యలు కాంగ్రెస్ చేపట్టలేదు. దీనికి తోడు ఆయన మరింత రెచ్చిపోయేలా కమల్ నాధ్ చర్యలు ఉన్నాయంటున్నారు. అధికారులు సింధియా మాట వినకకపోవడం, పార్టీ పట్టించుకోక పోవడంతోనే సింధియా సీరియస్ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. సింధియా ఆషామాషీ నేత కాదన్న సంగతి పార్టీ హైకమాండ్ కు తెలుసు. పార్టీకి భవిష్యత్తులో సింధియా దిక్కని కూడా తెలుసు. అయినా నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగానే కాంగ్రెస్ కు మధ్యప్రదేశ్ లో ఈ పరిస్థితి దాపురించింది.
ఉదాహరణలు కన్పిస్తున్నా…..
ఒక్కసారి టెన్ జన్ పథ్ కు సింధియాను పిలిచి చర్చలు జరిపి ఉంటే ఇంత తెగింపుకు ఆయన పాల్పడి ఉండేవారు కాదు. కానీ ఆ పని చేయలేదు. అందుకు ఇగోయే కారణం. దీంతోనే మమత బెనర్జీ, వైఎస్ జగన్, కేసీఆర్, శరద్ పవార్ లాంటి నేతలు పార్టీని వదిలేసి వేరు కుంపటి పెట్టుకునిసక్సెస్ అయ్యారు. ఆ ఇగోను వదిలేసుకుంటే తప్ప కాంగ్రెస్ బాగుపడే పరిస్థితి లేదంటున్నారు. మధ్యప్రదేశ్ లో పరిణామాలకు బీజేపీని నిందించి లాభం లేదు. కాంగ్రెస్ ఆత్మశోధన చేసుకుంటేనే బెటర్. భవిష్యత్తులోనైనా మరికొందరు నేతలు పార్టీని వీడకుండా ఉంటారు.