కాంగ్రెస్ కాపాడుకోగలదా?
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడైనా మళ్లీ మారే అవకాశాలున్నాయంటున్నారు. ఒకసారి రాంగ్ స్టెప్ వేసిన బీజేపీ మరోసారి ఆపని చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందుకు కొంత సమయం [more]
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడైనా మళ్లీ మారే అవకాశాలున్నాయంటున్నారు. ఒకసారి రాంగ్ స్టెప్ వేసిన బీజేపీ మరోసారి ఆపని చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందుకు కొంత సమయం [more]
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడైనా మళ్లీ మారే అవకాశాలున్నాయంటున్నారు. ఒకసారి రాంగ్ స్టెప్ వేసిన బీజేపీ మరోసారి ఆపని చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందుకు కొంత సమయం తీసుకోవాలని భావిస్తుంది. అయితే ఈసారి ఆపరేషన్ పక్కాగా జరగాలన్న ప్రణాళికలను బీజేపీ వ్యూహకర్తలు రచిస్తున్నారు. మహారాష్ట్రలో అధికారం బీజేపీ కి అందినట్లే అంది చేజారి పోయింది. అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.
తీవ్ర అవమానంతో….
కేవలం అధికారం పోవడమే కాకుండా దేశ వ్యాప్తంగా మోడీ, అమిత్ షాలకు అవమానం ఎదురయింది. దీని నుంచి వారు బయట పడలేకపోతున్నారు. మహారాష్ట్రలో బీజేపీకి 105 స్థానాలు దక్కాయి. మరో పదిహేను మంది వరక స్వతంత్ర సభ్యుల మద్దతు లభించే అవకాశముంది. మ్యాజిక్ ఫిగర్ 244 స్థానాలు కావడంతో మరో 22 మంది మద్దతు భారతీయ జనతా పార్టీకి కావాల్సి ఉంది. అయితే అంత సంఖ్యలో ఎమ్మెల్యేలను తీసుకురావడం కష్టమని పార్టీలోని కొందరు నేతలు భావిస్తున్నారు.
అసంతృప్తి గ్యారంటీ…..
కానీ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఖచ్చితంగా కూటమిలో లుకలుకలు ఏర్పడతాయి. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లోనే అసంతృప్తులు ఎక్కువగా ఉంటాయి. కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి రావడంతో సహజంగానే పదవులు దక్కని నేతలు పక్క చూపులు చూస్తారు. కర్ణాటకలో 14 నెలల సంకీర్ణ ప్రభుత్వంలో ఇదే జరిగింది. అక్కడ జేడీఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, కాంగ్రెస్ నుంచి 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇదే విధానాన్ని మహారాష్ట్రలో కూడా అనుసరించే అవకాశముందని చెబుతున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలే టార్గెట్…..
కాంగ్రెస్ కు మహారాష్ట్రలో 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో పదవులు దక్కేది కేవలం పది నుంచి పదమూడు పదవులకు మించి దక్కవు. పదవుల్లోనూ ప్రాధాన్యత ఉన్న పోస్టులు కాంగ్రెస్ కు ఇచ్చేందుకు ఇటు శివసేన, అటు ఎన్సీపీలు ఇష్టపడవు. దీంతో అసమ్మతి పెల్లుబికే అవకాశముంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కట్టడి చేసే శక్తి, సామర్థ్యం ఆపార్టీ రాష్ట్ర నేతలకు లేవని బీజేపీ నమ్ముతోంది. అందుకే ఆపరేషన్ ను ఆరునెలల తర్వాత ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఏ విధంగా కాపాడుకుంటోందో చూడాలి.