Punjab : పంజాబ్ లో పీకిందేమిటి?
కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీకి మరింత తలనొప్పిని తెస్తున్నాయి. పంజాబ్ లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో గెలుపొందాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ [more]
కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీకి మరింత తలనొప్పిని తెస్తున్నాయి. పంజాబ్ లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో గెలుపొందాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ [more]
కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీకి మరింత తలనొప్పిని తెస్తున్నాయి. పంజాబ్ లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో గెలుపొందాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కొంతకాలంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీని రాజకీయంగా మరింత దిగజార్చాయి. ఒకటి సిద్ధూను పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమించడం. రెండు అమరీందర్ సింగ్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం. ఈ రెండు తప్పిదాలతో పార్టీ మరింత నష్టపోయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
రెండు వర్గాలను….
ఏదైనా నిర్ణయం తీసుకుంటే రెండు వర్గాలను సంతృప్తి పర్చాల్సి ఉంటుంది. అదే అప్పుడు సరైన డెసిషన్ అవుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇద్దరినీ అసంతృప్తికి గురి చేసింది. సిద్ధూను పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన నాటి నుంచే వివాదాలు మరింత ముదురుతాయని కాంగ్రెస్ అధినాయకత్వానికి తెలియంది కాదు. అయినా అమరీందర్ కు వ్యతిరేకంగా సిద్ధూను పీసీసీ చీఫ్ గా ఎంపిక చేసింది. అప్పటి నుంచి ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోయారు.
స్మూత్ గా తప్పించి ఉంటే?
తర్వాత అమరీందర్ సింగ్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపి చరణ్ జిత్ సింగ్ ను నియమించింది. ఇంతవరకూ ఎన్నికల స్ట్రాటజీయే అనుకుందాం. కానీ అమరీందర్ పార్టీకి పూర్తిగా దూరమయ్యే రీతిలో ఆయన ఎగ్జిట్ ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అమరీందర్ ను స్మూత్ గా తప్పించాల్సి ఉండగా కఠినంగా తప్పించడంతో ఆయన పార్టీకి దూరమవుతున్నారు. ఇది ఎన్నికల సమయంలో పార్టీకి కష్టాలు కొని తెచ్చుకుందే.
సిద్ధూ రాజీనామాతో….
తాజాగా పీసీసీ చీఫ్ పదవికి నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేశారు. సిద్ధూకు ఇష్టం లేకుండా ఉపముఖ్యమంత్రిగా సుఖజిందర్ సింగ్ రాంధావా నియామకం జరిగింది. భవిష్యత్ లో తన పదవికి ఆయన అడ్డువస్తారన్న కారణంతో సిద్దూ అలిగి రాజీనామా చేశారు. సిద్ధూకు మద్దతుగా ఇద్దరు మంత్రులు రాజీనామా బాట పట్టారు. మంత్రి వర్గ విస్తరణ చేసిన గంటల్లోనే అసమ్మతి మామూలుగా అంటుకోలేదు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం డైలమాలో పడింది. పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలే ఆ పార్టీకి శాపంగా పరిణమించాయి. ఇంతకీ ఇప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వం ఏం సాధించింది.