ఎగిరెగిరి పడితే అంతే
ఏమీ లేకున్నా ఎగిరెగిరి పడుతుందన్న సామెత కాంగ్రెస్ పార్టీకి అచ్చుగుద్దినట్లు సరిపోతోంది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి బలం లేదన్న సంగతి తెలిసిందే. అదికూటమిలో ఉండి ఆపార్టీలు ఇచ్చిన [more]
ఏమీ లేకున్నా ఎగిరెగిరి పడుతుందన్న సామెత కాంగ్రెస్ పార్టీకి అచ్చుగుద్దినట్లు సరిపోతోంది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి బలం లేదన్న సంగతి తెలిసిందే. అదికూటమిలో ఉండి ఆపార్టీలు ఇచ్చిన [more]
ఏమీ లేకున్నా ఎగిరెగిరి పడుతుందన్న సామెత కాంగ్రెస్ పార్టీకి అచ్చుగుద్దినట్లు సరిపోతోంది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి బలం లేదన్న సంగతి తెలిసిందే. అదికూటమిలో ఉండి ఆపార్టీలు ఇచ్చిన స్థానాల్లో పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కాల్సి ఉంటుంది. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం బలంగా ఉన్న తమిళనాడులో కాంగ్రెస్, బీజేపీలది ప్రేక్షక పాత్రేనన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కాంగ్రెస్ తనకు అన్ని విధాలుగా అండగా ఉన్న డీఎంకేను దూరం చేసుకుంటోంది. జాతీయ స్థాయిలో నేతలు డీఎంకే వైపు మొగ్గు చూపుతున్నా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ నేతలు మాత్రం డీఎంకేపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.
పక్కన పెట్టడమే మేలని….
దీంతో డీఎంకే అధినేత స్టాలిన్ సయితం కాంగ్రెస్ ను పక్కన పెట్టడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు సరైన సంఖ్యలో సీట్లు ఇవ్వలేదని పీసీసీ చీఫ్ ఆళగిరి ఆరోపించారు. డీఎంకే పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు లేఖ కూడా రాయడాన్ని స్టాలిన్ సీరియస్ గా తీసుకున్నారు. అందుకే ఇటీవల పౌరసత్వ చట్ట సవరణపై కాంగ్రెస్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కూడా డీఎంకే డుమ్మా కొట్టింది. కాంగ్రెస్ నేతలను కంట్రోల్ లో పెట్టాలని స్టాలిన్ ఇప్పటికే హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది.
కొద్దో గొప్పో ఓటు బ్యాంకున్న….
నిజానికి డీఎంకే లేకుంటే తమిళనాడులో కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ కు ఉన్న కొద్దో గొప్పో ఓటు బ్యాంకు దళితులు, ముస్లింలే. ఈ ఓటు బ్యాంకు కోసమే డీఎంకే కాంగ్రెస్ ను చేరదీస్తూ వస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం సీట్ల సర్దుబాటు విషయంలో ససేమిరా అంటోంది. ఇటీవల జరిగిన రెండు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలు కావడం వెనక కాంగ్రెస్ క్యాడర్ సహకారం అందలేదన్న అనుమానం స్టాలిన్ లో ఉంది. మరోవైపు కాంగ్రెస్ రజనీకాంత్ పార్టీవైపు చూస్తుందన్న ప్రచారం కూడా జరుగుతుంది.
చల్లారినప్పటికీ…..
అన్నీ వెరసి డీఎంకే, కాంగ్రెస్ ల మధ్య చిచ్చు పెట్టాయని తెలుస్తోంది. అందుకే డీఎంకే సీనియర్ నేత దురై మురుగన్ కాంగ్రెస్ కు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఉంటే ఉండండి..లేకుంటే వెళ్లండి. వెళితే నష్టం మీకే అని కాంగ్రెస్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అధిష్టానం రంగంలోకి దిగి పరిస్థితిని శాంతింప చేసేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగినా భవిష్యత్తులో కాంగ్రెస్, డీఎంకే ల మధ్య సయోధ్య సజావుగా ఉంటుందని మాత్రం చెప్పలేని పరిస్థితి నెలకొంది.