ఆయనను కూడా మారుస్తారటగా?
తెలంగాణలో కాంగ్రెస్ కు కొత్త ఇన్ ఛార్జిని నియమించాల్సిన అవసరం ఉందంటున్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని కాంగ్రెస్ నేతలు విశ్వసిస్తున్నారు. ఆ వేడిని [more]
తెలంగాణలో కాంగ్రెస్ కు కొత్త ఇన్ ఛార్జిని నియమించాల్సిన అవసరం ఉందంటున్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని కాంగ్రెస్ నేతలు విశ్వసిస్తున్నారు. ఆ వేడిని [more]
తెలంగాణలో కాంగ్రెస్ కు కొత్త ఇన్ ఛార్జిని నియమించాల్సిన అవసరం ఉందంటున్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని కాంగ్రెస్ నేతలు విశ్వసిస్తున్నారు. ఆ వేడిని చల్లార్చకుండా ఉండాలంటే కొత్త పీసీసీ చీఫ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జిని కూడా మార్చాలని పార్టీ హైకమాండ్ భావిస్తుంది. దీంతో కొత్త ఇన్ ఛార్జిగా ఎవరు వస్తారన్న దానిపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది.
పూర్తిగా దూరంగా…..
ప్రస్తుతం రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జిగా మాణికం ఠాగూర్ వ్యవహరిస్తున్నారు. ఆయన పెద్దగా ఇటీవల కాలంలో పట్టించుకోవడం లేదు. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత మాణికం ఠాగూర్ గాయబ్ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇక సాగర్ ఉప ఎన్నికలకు ఆయన పూర్తిగా దూరంగా ఉన్నారు. చివరలో వచ్చి మమ అనిపించారు. తమిళనాడు ఎన్నికల్లో బిజీగా ఉన్నారనుకున్నా, పెద్దగా తెలంగాణను పట్టించుకోలేుద.
గ్రూపు విభేదాలు….
తెలంగాణ కాంగ్రెస్ నేతల రాజకీయాల పట్ల మాణికం ఠాగూర్ సంతృప్తి కరంగా లేరంటున్నారు. గ్రూపు విభేదాలతో సతమతమవుతున్న పార్టీని బలోపేతం చేయడం కష్టమేనని, తనంతట తానుగా ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పుకోవడమే బెటర్ అని కాంగ్రెస్ ఇన్ ఛార్జి భావిస్తున్నట్లు సమాచారం. పీసీసీ చీఫ్ నియామకంలోనూ ఆయన మాట చెల్లుబాటు కాకపోగా ఆయనపై కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
తనను తప్పించాలంటూ….
దీంతో తనను కూడా తప్పించాలని మాణికం ఠాగూర్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్ తీరుపై ఆయన సమగ్ర నివేదికను రూపొందించి అధనినాయకత్వానికి ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. పీసీసీ చీఫ్ గా సమర్థుడైన వారిని నియమిస్తే తప్ప ఇక్కడ పార్టీ బట్ట కట్టలేదని ఆయన నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. మొత్తం మీద ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ ఛార్జి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.