కాంగ్రెస్ ధైర్యమేంటో… సాహసోపేతమైన నిర్ణయమే?
వచ్చే పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్టాత్మకం. ఈసారి కూడా విజయం సాధించకపోతే పదిహేనేళ్ల పాటు కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అందుకే రానున్న [more]
వచ్చే పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్టాత్మకం. ఈసారి కూడా విజయం సాధించకపోతే పదిహేనేళ్ల పాటు కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అందుకే రానున్న [more]
వచ్చే పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్టాత్మకం. ఈసారి కూడా విజయం సాధించకపోతే పదిహేనేళ్ల పాటు కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అందుకే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయం అత్యంత అవసరం. అయితే ఆ ఎన్నికలకు ముందు జరిగే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా అంతే ముఖ్యం. ఉత్తర్ ప్రదేశ్ లో విజయం సాధిస్తేనే ఢిల్లీ పీఠం దక్కుతుందన్నది అందరికీ తెలిసిందే.
ప్రియాంక గాంధీ పర్యవేక్షణలో….
అయితే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ మేరకు సమాయత్తం అవుతుందంటే ఆశ్చర్యపోక తప్పదు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ పార్టీ వ్యవహారాలను ప్రియాంక గాంధీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ బలంగా ఉంది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలైన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలను కాంగ్రెస్ ఎదుర్కొనాల్సి ఉంటుంది. అదే సమయంలో ఉత్తర్ ప్రదేశ్ లో అనేక చిన్నా చితకా పార్టీలున్నాయి.
అన్ని పార్టీలకూ దూరంగా…?
గతంలో కాంగ్రెస్ సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఆశించిన స్థానాలు రాలేదు. ఈసారి తాము కాంగ్రెస్ ను కలుపుకుని వెళ్లేది లేదని సమాజ్ వాదీ పార్టీ చెప్పేసింది. యూపీలో దాదాపు రెండు వందలకు పైగానే చిన్న పార్టీలున్నాయి. వీరిని కలుపుకుని పోయేందుకు బీజేపీ, ఎస్సీ, బీఎస్పీలు ప్రయత్నిస్తున్నాయి. వీరివల్ల గత ఎన్నికల్లో దాదాపు అరవై నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు దెబ్బతిన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.
ఒంటరిగా పోటీ చేసి….
కానీ కాంగ్రెస్ మాత్రం తాము ఒంటరిగానే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతోంది. ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటి లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవ్వాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా కన్పిస్తుంది. మరి ఇన్ని పార్టీల మధ్య కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఏ మేర స్థానాలు సాధిస్తుందన్నది ప్రశ్నార్థకమే. గత పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీయే అమేధీ నుంచి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేయాలన్న కాంగ్రెస్ నిర్ణయం సాహసోపేతమైనదేనని చెప్పాలి.