ఆమె ఎంపిక…భవిష్యత్ కోసమేనా?
కాంగ్రెస్ అధికారానికి పదేళ్ల పాటు దూరంగా ఉంది. ఆర్థికంగా పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. మూడు రాష్ట్రాలు మినహాయించి కాంగ్రెస్ ఎక్కడా అధకారంలో లేదు. మరోవైపు మోడీ [more]
కాంగ్రెస్ అధికారానికి పదేళ్ల పాటు దూరంగా ఉంది. ఆర్థికంగా పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. మూడు రాష్ట్రాలు మినహాయించి కాంగ్రెస్ ఎక్కడా అధకారంలో లేదు. మరోవైపు మోడీ [more]
కాంగ్రెస్ అధికారానికి పదేళ్ల పాటు దూరంగా ఉంది. ఆర్థికంగా పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. మూడు రాష్ట్రాలు మినహాయించి కాంగ్రెస్ ఎక్కడా అధకారంలో లేదు. మరోవైపు మోడీ బలంగా ఉన్నారు. మోడీ, షా జిమ్మిక్కులకు కాంగ్రెస్ కోలుకోలేకుండా ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని రాహుల్ గాంధీ వదిలేశార. సోనియా గాంధీ ఉండీ లేనట్లు పార్టీని నడిపిస్తున్నారు. ఈ క్రమంలో మరోమారు కేంద్రంలో అధికారంలోకి రాలేకపోతే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతే.
నైరాశ్యంలో కాంగ్రెస్…..
అందుకే కాంగ్రెస్ కు 2024 ఎన్నికలు ప్రతిష్టాత్మకమని చెప్పక తప్పదు. పదేళ్లు అధికారంలో లేకుండా పోతుండంతో క్యాడర్ లో నిరాశ నిస్సత్తువలు ఆవరించాయి. ఎక్కడికక్కడ ముఖ్యనేతలు సయితం కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతుండటంతో రాష్ట్రాల్లో నాయకత్వ లేమి కూడా కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉంటుందా? మళ్లీ కోలుకుంటుందా? అన్న ప్రశ్నలు ఆ పార్టీలోనే తలెత్తుతున్నాయి.
విరుగుడు మంత్రం ఇదేనా?
అయితే ఇందుకు విరుగుడు మంత్రాన్ని కాంగ్రెస్ అగ్రనాయకత్వం కనిపెట్టిందంటున్నారు. దేశ రాజకీయాల్లో ఒక సెంటిమెంట్ ఉంది. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో అత్యధిక సీట్లు వస్తే చాలు హస్తినలో పీఠమెక్కినట్లే. అందుకే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడిన ఉత్తర్ ప్రదేశ్ పై గురిపెట్టింది. మరో రెండేళ్లలో జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించేందుకు సిద్దమయింది.
వర్క్ అవుట్ అవుతుందా?
ఈ మేరకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేతలు సయితం ప్రియాంక గాంధీతో చర్చించారని తెలిసింది. సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు ప్రియాంక గాంధీ అంగీకరించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జితిన్ ప్రసాద ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. లోక్ సభ ఎన్నికల కంటే ముందుగా జరిగే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. మరి ప్రియాంక గాంధీని యూపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా త్వరలోనే ఎన్నికల సైరన్ మోగించనుంది.