తూచ్…అంటే సరిపోతుందా…?
రాహుల్ గాంధి పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఇపుడు హ్యాపీగా జాలీగా ఉన్నారు. ఢిల్లీలో సినిమాలు చూస్తున్నారు. పాప్ కార్న్ తింటూ ఎన్నడూ లేని ఆనందాన్ని [more]
రాహుల్ గాంధి పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఇపుడు హ్యాపీగా జాలీగా ఉన్నారు. ఢిల్లీలో సినిమాలు చూస్తున్నారు. పాప్ కార్న్ తింటూ ఎన్నడూ లేని ఆనందాన్ని [more]
రాహుల్ గాంధి పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఇపుడు హ్యాపీగా జాలీగా ఉన్నారు. ఢిల్లీలో సినిమాలు చూస్తున్నారు. పాప్ కార్న్ తింటూ ఎన్నడూ లేని ఆనందాన్ని పొందుతున్నారు. అంతేనా రోడ్డు పక్కన రెస్టారెంట్లో టీ, టిఫిన్ కానిచ్చేస్తున్నారు. కారు వదిలేసి . కాలి నడకన చాలా దూరం నడుస్తున్నారు. ఓ విధంగా రాహుల్ కి ఇది కొత్త జీవితం. నిజమే ఆయన సరదా ఎందుకు కాదనాలి. రాహుల్ గోల్డెన్ స్పూన్ తో పుట్టడం వల్ల ఇంతవరకు ఈ రకమైన జీవితాన్ని ఆయన అనుభవించలేకపోయారు . ఇపుడు ఆయన పంజరాలను, బంధనాలను తెంపుకుంటూ స్వేచ్చా జీవిగా లోకాన్ని చూస్తున్నారు. అందులో ఆనందాన్ని ఆస్వాదిస్తూ రెక్కలు వచ్చిన కొత్త పక్షిలా విహరిస్తున్నారు.
ఇష్టం లేని వ్యాపకమా…?
నిజానికి రాహుల్ గాంధీకి రాజకీయాలు పడవన్న మాట ప్రచారంలో ఉంది. ఆయన తల్లి సోనియా గాంధి బలవంతం మీద ఆయన రాజకీయాల్లోకి వచ్చారని అంటారు. తమ కుటుంబం చేతుల్లో నుంచి అధికారం పోకూడదన్న సోనియా తాపత్రయం రాహుల్ ని అలా చేసింది. పదిహేనేళ్ళ నుంచి ఆయన ఎంపీగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా, రెండేళ్ల క్రితం అధ్యక్షునిగా కూడా పనిచేశారు. రాహుల్ పోకడలు వేరు, పార్టీలో ఉన్న మూస నాయకుల ధోరణి వేరు. దాంతో తాను కోరుకున్న విధంగా కాకుండా సిండికేట్ తరహాలో కాంగ్రెస్ రాజకీయాలు సాగడం చూసి రాహుల్ తూచ్ అనేసారు. ఇపుడు రాహుల్ ఓ కార్యకర్తగా ఉంటానని అంటున్నారు.
నమ్ముకున్న వారిని అలా…..
ఓ విధంగా రాహుల్ గాంధీ చేసింది ఆయన వరకూ కరెక్ట్. కానీ నమ్ముకున్న లక్షలాది కార్యకర్లకు మాత్రం అది నమ్మక ద్రోహమే. రాహుల్ పుట్టింది రాజవంశంలో అంటే కాంగ్రెస్ మహారాజుల వారసునిగా. ఈ నేపధ్యంలో రాహుల్ కొన్ని అనుకున్నా అది వ్యక్తిగతం, కానీ గాంధీ వంశం వారసునిగా ఆయన మీద పెద్ద బాధ్యతలు ఉన్నాయి. వాటిని తీర్చాల్సిన కర్తవ్యం ఆయన మీద ఉంది. నిజమే రెండు సార్లు పార్టీ ఓడిపోయింది. అయినా ఈ రోజుకూ కూడా బీజేపీ తరువాత పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ మాత్రమే. బీజేపీ కంటే ఎక్కువ గ్రామాల్లో తెలిసిన పార్టీ కూడా కాంగ్రెస్ ఒక్కటే. రాహుల్ పార్టీని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి అందులో ఉండే గట్టిగా పోరాడాలి. ఇలా బయటకు వచ్చి కాడి వదిలేయడం కాదు. రాహుల్ రాజీనామా ఒక్క కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు, ఇది దేశంలోకి ప్రజాస్వామ్య వాదులకు కూడా సమస్యే. బీజేపీకి పోటీగా కాంగ్రెస్ లాంటి ఉదారవాద, లౌకిక భావాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ రేసులో ఉండాల్సిందే. రాహుల్ మాత్రం తప్పు చేస్తున్నారు. తనతో పాటు అందరినీ ముంచేస్తున్నారు.