కాంగ్రెస్ కు నిద్రపట్టేది అప్పుడేనట?
రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్ చావుకొచ్చినట్లే కనపడుతుంది. రాజ్యసభ ఎన్నికలు పూర్తయితే తప్ప బీజేపీ శాంతించే పరిస్థితి లేదులా ఉంది. ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ రాజ్యసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా [more]
రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్ చావుకొచ్చినట్లే కనపడుతుంది. రాజ్యసభ ఎన్నికలు పూర్తయితే తప్ప బీజేపీ శాంతించే పరిస్థితి లేదులా ఉంది. ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ రాజ్యసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా [more]
రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్ చావుకొచ్చినట్లే కనపడుతుంది. రాజ్యసభ ఎన్నికలు పూర్తయితే తప్ప బీజేపీ శాంతించే పరిస్థితి లేదులా ఉంది. ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ రాజ్యసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ రాజ్యసభ లో బలం పెంచుకోవడానికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తుంది. మొన్న మధ్యప్రదేశ్, నేడు గుజరాత్, రాజస్థాన్ లలో ఇదే పరిస్థిితి కన్పిస్తుంది. కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేక క్యాంపులను నిర్వహించాల్సి వస్తుంది.
గుజరాత్ లో అప్పటి సీన్…..
గుజరాత్ లో గతంలో సీన్ రిపీట్ అయిందనే చెప్పాలి. అప్పట్లో అహ్మద్ పటేల్ రాజ్యసభకు పోటీ చేసినప్పుడు ఇదే సీన్ కన్పించింది. అప్పట్లో కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్ కు తరలించాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా దాదాపు పది మందికి పైగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. నేరుగా ఢిల్లీ నుంచి గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను డీల్ చేస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
రాజస్థాన్ లోనూ…..
రాజస్థాన్ లోనూ అంతే. అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ లో నెలకొన్న వర్గ విభేదాలే. ఈనెల 19వ తేదీ నాటికి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ అప్రమత్తమయ్యారు. సచిన్ పైలెట్ తో కలసి ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వరస మీటింగ్ లు పెడుతున్నారు.
వస్తే కాదనలేం….
అయితే బీజేపీ మాత్రం మైండ్ గేమ్ ప్రారంభించింది. తమతో ఎవరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో లేరని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా స్పష్టం చేశారు. అయితే మోడీ విధానాలు నచ్చి తమ పార్టీలోకి వస్తామంటే కాదనమని ఆయన స్పష్టం చేశారు. రాజస్థాన్ లో తమ ప్రమేయంతోనే ఎమ్మెల్యేలు పక్కకు వెళుతున్నారన్న కాంగ్రెస్ వాదన సరికాదన్నారు. మొత్తం మీద ఈ నెల 19వ తేదీన రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ కాంగ్రెస్ కు కంటి మీద కునుకు ఉండదని చెప్పాలి.