రంకెలు వేసినంత మాత్రాన?
పశ్చిమాసియా దేశమైన ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంది. తన సైనిక జనరల్ ఇబ్రహీం సులేమానీ హత్యతో అమెరికాను అంతం చేయాలని ఆవేశపడుతుంది. ఇందులో భాగంగా అగ్రరాజ్యం అమెరికాకు అనేక [more]
పశ్చిమాసియా దేశమైన ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంది. తన సైనిక జనరల్ ఇబ్రహీం సులేమానీ హత్యతో అమెరికాను అంతం చేయాలని ఆవేశపడుతుంది. ఇందులో భాగంగా అగ్రరాజ్యం అమెరికాకు అనేక [more]
పశ్చిమాసియా దేశమైన ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంది. తన సైనిక జనరల్ ఇబ్రహీం సులేమానీ హత్యతో అమెరికాను అంతం చేయాలని ఆవేశపడుతుంది. ఇందులో భాగంగా అగ్రరాజ్యం అమెరికాకు అనేక హెచ్చరికలు జారీ చేసింది. ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులకు దిగింది. ఇందులో పెద్దయెత్తున అమెరికన్ సైనికలు మరణించారని ఇరాన్ చెబుతుండగా, అలాంటిదేమీ లేదని, జరిగిన నష్టం తక్కువేనని వాషింగ్టన్ స్పష్టం చేసింది. ఇంతటితో ఆగమని, అమెరికా అధినేతకు చుక్కలు చూపిస్తామని పర్షియన్ గల్ఫ్ దేశమైన ఇరాన్ అదేపనిగా హుంకరిస్తుంది.
వైరం ఈనాటిది కాదు….
ఇరాన్ – అమెరికా వైరం ఈనాటిది కాదు. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. గత ఏడాది జూన్ లో పర్షియన్ గల్ఫ్ లో ఆరు చమురు ట్యాంకర్లు ధ్వంసం కావడానికి బెహరాన్ కారణమని వాషింగ్టన్ ఆరోపిస్తుంది. అదే విధంగా గత ఏడాది సెప్టంబరు 14న సౌదీ అరేబియాలోని ఆరామ్ కో చమురు క్షేత్రంపై ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటు దారులు దాడిచేశారన్నది అమెరికా అనుమానం, ఆరోపణ. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దాని ఫలితమే సులేమానీ హత్య అని దౌత్య నిపుణులు చెబుతున్నారు. దీతో ఇరాన్ చెలరేగుతుంది. అమెరికాను నాశనం చేస్తామని హెచ్చరిస్తోంది.
అంత సత్తా ఉందా?
ఆవేశంలో చేసిన ప్రకటనలను పక్కన పెడితే అమెరికాను ఎదుర్కొనే సత్తా, శక్తి సామర్థ్యాలు ఇరాన్ కు ఉన్నాయా? లేదా? అన్నది ప్రశ్నార్థకమే. హడావిడిగా నాలుగు క్షిపణులను ప్రయోగించిన తర్వాత, పర్షియన్ గల్ఫ్ లో చమురు రవాణా చేస్తున్న నౌకలపై దాడులు చేసినంత మాత్రాన అమెరికాను నిలువరించే సత్తా ఇరాన్ కు ఉందా? అన్న ప్రశ్నకు సరైన సమాధానం లభించదు. నిర్దిష్టంగా చెప్పాలంటే అగ్రరాజ్యం బలం, బలగం ముందు ఇరాన్ శక్తి సామర్థ్యాలు దిగదుడుపే. సైనికంగా ప్రపంచ వ్యాప్తంగా అమెరికా మొదటి స్థానంలో ఉండగా, ఇరాన్ 14వ స్థానంలో ఉంది. ఇరాన్ దగ్గర 3,98,040 సైన్యం, 3,50,000 గ్రౌండ్ ఫోర్స్, 18000 మంది నౌకాదళం, 30,000 మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. అత్యంత కీలకమైన 1,25,000 మంది రివల్యూషనరీ గార్డులున్నారు. అమెరికా చేతిలో హత్యకు గురైన సులేమానీ ఈ దళాలకు నాయకత్వం వహించే వారు. రిజర్వ్ సైనికులు మూడు లక్షల మంది, మిలటరీ వాలంటీర్లు ఆరులక్షల మంది ఉన్నారు. అమెరికా సైనిక, ఆయుధ సంపత్తి ముందు ఇరాన్ బలగాలు పెద్దగా లేక్కలోనివి కావు. దీనికి తోడు ఇరాన్ – ఇరాక్ యుద్ధం కారణంగా ఆర్థికంగా, సైనికంగా చాలా నష్టపోయింది. ఏళ్ల తరబడి సాగిన ఈ యుద్థం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. ఇక అమెరికా ఆంక్షల కారణంగానూ నష్టపోయింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు చమురు వ్యాపారం. అమెరికా ఆంక్షల ఫలితంగా చమురు వ్యాపారం కకావికలమై ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇరాన్ తో చమురు వ్యాపారం చేయవద్దంటూ గత ఏడాది భారత్ సహా అనేక దేశాలపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారు. దీంతో ఇరాన్ ఎంతో నష్టపోయింది. ఆర్థికంగా చితికిపోయింది.
మద్దతు ఏదీ?
ఇక అరబ్ ప్రపంచంలోనూ ఇరాన్ కు మద్దతు లేదు. షియా, సున్నీల తేడాల కారణంగా పలు సున్నీ దేశాలతో ఇరాన్ కు సత్సంబంధాలు లేవు. ముఖ్యంగా అరబ్ ప్రపంచంలో కీలకమైన సౌదీ అరేబియాతో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. ఒక్క సిరియా, లెబనాన్, కువైట్, ఇరాక్ లు తప్ప ఇరాన్ కు మద్దతిచ్చే దేశాలు లేవు. సిరాయా, ఇరాక్ లు అంతర్యుద్ధంతో సతమతమవుతున్నాయి. అంతర్యుద్ధం కారణంగా ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయి. సిరియా, ఇరాక్ ల పరిస్థితి ఇప్పటికీ దయనీయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏ కోణంలో విశ్లేషించినా నష్టపోయేది ఇరానే. ఇక అంతర్జాతీయంగా చైనా, రష్యా వంటి అగ్రదేశాలు మద్దతు ఉన్నప్పటికీ, ఇరాన్ కోసం అవి అమెరికాతో నేరుగా తలపడే పరిస్థితి లేదు. అవి తెర వెనక సాయానికే పరిమిత మవుతాయి. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు, నాటో దేశాలు సహజంగానే అమెరికాకు వంతపాడుతాయి. ఇరాన్ మొదటి నుంచి “నో ఫస్ట్ స్ట్రయిక్” విధానానికి వ్యతిరేకం. ఇరాన్ రాజ్యాంగం అంగీకరించక పోవడంతో ఆ దేశంతో ఇతర దేశాలు ఏవీ సైనిక స్థావరాలు ఏర్పాటు చేయలేదు. మొత్తానికి అమెరికా బలం, బలగం ముందు ఇరాన్ బలం, బలగం దిగదుడుపే.
-ఎడిటోరియల్ డెస్క్