జగన్ను తిట్టి.. బలయ్యామా? టీడీపీలో అంతర్మథనం
టీడీపీలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో పరాజయం అంశం కాకరేపుతోంది. పైకి మాత్రం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వంటి సీనియర్లు [more]
టీడీపీలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో పరాజయం అంశం కాకరేపుతోంది. పైకి మాత్రం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వంటి సీనియర్లు [more]
టీడీపీలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో పరాజయం అంశం కాకరేపుతోంది. పైకి మాత్రం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వంటి సీనియర్లు గుంభనంగా ఉంటూనే వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టినా.. లోలోన మాత్రం అంతర్మథనం చెందుతున్నారు. ప్రధానంగా గడిచిన స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల తర్వాత.. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలో అయినా.. పార్టీ పుంజు కుంటుందని అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా పార్టీ పరాజయంతో పాటు ఓటు బ్యాంకు కూడా భారీగా తగ్గిపోయింది.
జగన్ ను టార్గెట్ చేసి…..
దీంతో అసలు రీజన్ ఏంటి? అనేదానిపై లోతుగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఒక కీలక విషయం తెరమీదికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఏ ఎన్నిక చూసుకున్నా.. జగన్ను టార్గెట్ చేయడం.. జగన్పై దుమ్మెత్తిపోయడం.. జగన్ జైలు పక్షి అని.. నేరస్తుడని.. తుగ్లక్ అని.. విమర్శలు చేయడం అనేది.. ప్రజల్లోకి వెళ్లలేదని.. వెళ్లినా.. వాళ్లు జీర్ణించుకోలేక పోతున్నారని.. పైగా మేధావి వర్గం కూడా జగన్ను టార్గెట్ చేసే విధానం ఇది కాదని.. కూడా అంటున్న విషయాన్ని సీనియర్లు ప్రస్తుతం ఫోన్లలో చర్చించుకుంటున్నారని తెలుస్తోంది.
ఆ రికార్డే మళ్లీ…..
“అతిగా టార్గెట్ చేయడం కూడా తప్పే. పైగా 2019లో వేసిన రికార్డే.. మళ్లీ తిరుపతిలోనూ ప్లే చేశారు. ఇదే రివర్స్ అయి ఉంటుంది“ అని చర్చించుకుంటుండడం గమనార్హం. ప్రస్తుతం ఎంత లేదన్నా.. కాదన్నా.. జగన్పై ప్రజల్లో కొంత మేరకు సింపతీ ఉంది. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక లబ్ధి జనాలకు చేకూరలేదు. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ప్రజలకు జగన్ ఆర్థికంగా వివిధ పథకాల రూపంలో ఆదుకుంటున్నారు. సో.. ఈ క్రమంలో జగన్పై విమర్శలను లేదా .. ఆయనను దిగజార్చే విధంగా చేసే వ్యాఖ్యలను వారు సహించలేక పోతున్నారనే వాదన కూడా ఉంది.
విమర్శలతోనే…?
పైగా.. టీడీపీపై ఇలాంటి విమర్శలు.. వైసీపీ నుంచి ఎక్కడా వినిపించడం లేదు. వారి పథకాలను చూసి ప్రజలు ఓటేయాలని మాత్రమే వైసీపీ నేతలు కోరుతున్నారు. కానీ, టీడీపీ మాత్రం.. విమర్శలతోను.. ఎదురుదాడితోనూ సరిపుచ్చుతోంది. ఇదే.. టీడీపీ సంస్థాగత ఓటు బ్యాంకు కదిలిపోతుండడం కూడా రీజన్ అని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిపై దృష్టి పెట్టాల్సిన.. చంద్రబాబు ఆయన పరివారం.. మాత్రం కర్ర విడిచి సాము చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.