జగన్ స్కెచ్ సక్సెస్ కాలేదట..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పథ్నాలుగు నెలలు దాటుతోంది. అనేక నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం లేదు. రోజురోజుకూ విభేదాలు తీవ్రమవుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పథ్నాలుగు నెలలు దాటుతోంది. అనేక నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం లేదు. రోజురోజుకూ విభేదాలు తీవ్రమవుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పథ్నాలుగు నెలలు దాటుతోంది. అనేక నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం లేదు. రోజురోజుకూ విభేదాలు తీవ్రమవుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ పరిపాలనపరమైన పనులతో బిజీగా ఉండటంతో పార్టీ విషయాలను పట్టించుకోవడం లేదు. విభేదాలను పరిష్కరించే ప్రయత్నాలు చేయడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తలెత్తిన విభేదాలను అప్పటికప్పుడు పరిష్కరించగలిగినా మళ్లీ విభేదాలు మొదటికొచ్చాయి.
బిజీగా ఉండటంతో….
జగన్ తాను బిజీగా ఉండటంతో మూడు ప్రాంతాలకు ముగ్గురిని ఇన్ ఛార్జులుగా నియమించారు. ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి, గోదావరి జిల్లాలకు ఎస్వీ సుబ్బారెడ్డి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సజ్జల రామకృష్ణారెడ్డి, రాయలసీమలోని కొన్ని జిల్లాలకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించారు. అందరినీ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారినే నియమించారని జగన్ విమర్శలు ఎదుర్కొన్నా తనకు నమ్మకమైన వారైతేనే పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారని జగన్ భావించారు.
నలుగురిని నియమించినా…..
కానీ నలుగురు ఇన్ ఛార్జులు నియామకం అయిన తర్వాత కూడా నియోజకవర్గాల్లో విభేదాలు సమసిపోలేదు. ప్రధానంగా కర్నూలు జిల్లాలో కర్నూలు, నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుకు, వైసీపీ నేతలకు పొసగడం లేదు. అలాగే గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట, వినుకొండ, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాల్లోనూ అంతే. ప్రకాశం జిల్లాలో చీరాల నియోజకవర్గంలో ఆమంచి వర్సెస్ కరణం ఫైట్ కంటిన్యూనే అవుతుంది. కడప జిల్లాలో రామసుబ్బారెడ్డికి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మధ్య సఖ్యత లేదు. దీంతో అనేక నియోజవకర్గాల్లో క్యాడర్ అయోమయంలో ఉంది.
పరిష్కారం కాక….
ఇక పార్లమెంటు సభ్యులకు ఎమ్మెల్యేలకు మధ్య కూడా చాలా గ్యాప్ ఉంది. అయితే నలుగురిని నియమించినా వీరు జిల్లాలు తిరిగి నేతల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నాలేవీ చేయడం లేదంటున్నారు. ఏదైనా ముదిరితే తాడేపల్లి రప్పించుకుని మాట్లాడటం మినహా వీరు చేసిన ప్రయత్నాలేవీ లేవనే చెప్పాలి. ఇలాగే వదిలేస్తే వైసీపీ నేతల మధ్య గ్యాప్ మరింత పెరిగి పార్టీ బలహీనమవుతుందన్న ఆందోళన క్యాడర్ లో వ్యక్తమవుతోంది. విభేదాలను పరిష్కరించడానికి జగన్ వేసినఫోర్ మెన్ కమిటీ స్కెచ్ సక్సెస్ కాలేదనే అంటున్నారు పార్టీ నేతలు.