ఇక తప్పుకోవడం మంచిదేనా?
కమ్యునిస్టు పార్టీలకు కాలం చెల్లినట్లే కన్పిస్తుంది. కొంత ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో సయితం ఉనికిని కోల్పోయే ప్రమాదంలో వామపక్ష పార్టీలు పడ్డాయి. కాంగ్రెస్ బలహీనం కావడం, కాషాయ [more]
కమ్యునిస్టు పార్టీలకు కాలం చెల్లినట్లే కన్పిస్తుంది. కొంత ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో సయితం ఉనికిని కోల్పోయే ప్రమాదంలో వామపక్ష పార్టీలు పడ్డాయి. కాంగ్రెస్ బలహీనం కావడం, కాషాయ [more]
కమ్యునిస్టు పార్టీలకు కాలం చెల్లినట్లే కన్పిస్తుంది. కొంత ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో సయితం ఉనికిని కోల్పోయే ప్రమాదంలో వామపక్ష పార్టీలు పడ్డాయి. కాంగ్రెస్ బలహీనం కావడం, కాషాయ పార్టీ దూకుడుగా ఉండటంతో ఇక మూటా ముల్లే సర్దుకోవడంలోనే మునిగిపోయారు ఎర్రన్నలు. నిజానికి కమ్యూనిస్టు పార్టీలు కార్పొరేట్ రాజకీయాలకు నేటికీ దూరంగానే ఉన్నాయి. పార్టీ ఏర్పడి వందేళ్లు కావస్తున్నా దేశంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అవి పార్టీని చక్కదిద్దుకోలేకపోయాయి.
ప్రజా సమస్యలపైనే….
ప్రధానంగా కమ్యునిస్టులు ప్రజా సమస్యలపైనే దృష్టిపెడతాయి. అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించడానికి వామపక్ష పార్టీలకు ఫుల్ రైట్ ఉందనడం వాస్తవం. రైతు సమస్యల నుంచి ఇళ్ల స్థలాల వరకూ పేదలకు ఎలాంటి అన్యాయం జరిగినా ముందుండేది కమ్యునిస్టు పార్టీలే. అయితే గత కొంతకాలంగా కార్పొరేట్ రాజకీయాలకు కమ్యునిస్టులు తట్టుకోలేకపోతున్నారు. గతంలో మాదిరి ప్రభుత్వాలు ఆందోళనలకు అనుమతి ఇవ్వడం లేదు. పైగా ప్రభుత్వాలే ఉచిత పథకాలను పెట్టి పేదలను తమ వైపు తిప్పుకుంటున్నాయి.
విద్యార్థి దశ నుంచే….
దీంతో పాటు గతంలో విద్యార్థి లోకం నుంచే కమ్యునిస్టు పార్టీ బలంగా ఉండేది. ఎస్.ఎఫ్.ఐ, ఏఐఎస్ఎఫ్ వంటి వామపక్ష పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు బలంగా ఉండేవి. పార్టీలు చేపట్టే ఆందోళనలో వారే ముందుండే వారు. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు కళాశాలల్లో ఎన్నికలను రద్దు చేశాయి. ఇప్పుడు విద్యార్థి సంఘాల్లో చేరే వారు కూడా తక్కువే. ఇక రాజకీయంగా ఎదిగిన వారు సయితం ఇతర పార్టీల వైపు చూస్తుండటం విశేషం. గతంలో కమ్యునిస్టు పార్టీలను ఆదర్శంగా తీసుకోవాలని అన్ని రాజకీయ పక్షాలు తమ నేతలకు సూచించేవారు.
ఎర్రజెండాను తొలగించి….
కానీ ఇప్పుడు అదే కమ్యునిస్టు పార్టీల నేతలు పార్టీలు జంప్ చేయడంలో ముందుంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో సీపీఎం, సీపీఐ నుంచి ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోవడం చర్చనీయాంశంగా మారింది. పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు, ఆశయాలున్న పార్టీలోకి వారు జంప్ చేయడం హాట్ టాపిక్ అయింది. సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒక ఎమ్మెల్యే ఎర్రజెండాను వదిలి కాషాయం కప్పుకోవడం చూస్తే కమ్యునిస్టులకు ఇక కాలం చెల్లినట్లే కన్పిస్తుంది.