తెలంగాణాలో ఆంధ్రా పార్టీలకు చాన్స్ ఉందా ?
తెలంగాణా ఏర్పడిన చరిత్ర తెలిసిన అంధ్రులు ఎవరైనా అక్కడ పోటీ అంటే బాగా ఆలోచించాల్సిందే. దశాబ్దన్నర తెలంగాణా ఉద్యమంలో ఆంధ్రుల పట్ల విద్వేష భావం నిండుగా నింపేశారు [more]
తెలంగాణా ఏర్పడిన చరిత్ర తెలిసిన అంధ్రులు ఎవరైనా అక్కడ పోటీ అంటే బాగా ఆలోచించాల్సిందే. దశాబ్దన్నర తెలంగాణా ఉద్యమంలో ఆంధ్రుల పట్ల విద్వేష భావం నిండుగా నింపేశారు [more]
తెలంగాణా ఏర్పడిన చరిత్ర తెలిసిన అంధ్రులు ఎవరైనా అక్కడ పోటీ అంటే బాగా ఆలోచించాల్సిందే. దశాబ్దన్నర తెలంగాణా ఉద్యమంలో ఆంధ్రుల పట్ల విద్వేష భావం నిండుగా నింపేశారు అన్నది అయితే గట్టిగా ప్రచారంలో ఉంది. ఇప్పటికి ఆరేళ్ళుగా ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా ఉన్నా తెలంగాణాలో బలం ఉన్నా కూడా చంద్రబాబు రాజకీయ ఉనికిని అక్కడ చాటుకోకపోవడానికి కారణమిదే. ఇక జగన్ కి తన సొంత సామాజికవర్గం బలం తెలంగాణా నిండా ఉంది. పైగా జగన్, వైఎస్సార్ అభిమానులు కూడా దండీగా ఉన్నారు. అయినా సరే వైసీపీ తెలంగాణా వైపు చూడడంలేదు. మరి జనసేనకు కూడా తెలంగాణాలో ఉనికి చాటుకోవాలని చాలానే ఆశ ఉంది.
అదే సమస్య…
అమెరికాలోనైనా ప్రవాస భారతీయులు పోటీ చేసి ఉన్నత స్థానాలకు వెళ్ళవచ్చునేమో కానీ తెలంగాణాలో ఇపుడున్న పరిస్థితుల్లో అసలు అలా కాదు, రాష్ట్రం విడిపోవడానికి పనిచేసిన అతి బలమైన ఫ్యాక్టర్ ఆంధ్రా యాంటీ సెంటిమెంట్. ఆ బూచిని చూపించే 2018 ఎన్నికల్లో కూడా మరోసారి కేసీయార్ మంచి లాభాన్ని పొందారు. చంద్రబాబుతో పొత్తు వల్ల కాంగ్రెస్ కుదేల్ అయింది. ఇక్కడ పోటీ చేయడం ముఖ్యం కాదు, పోటీ చేసి గెలిచినా తెలంగాణాను తెచ్చిన టీయారెస్ రాజకీయ వత్తిడులకు లొంగి పనిచేయాలి. ఇవాళా రేపూ తెలంగాణాలో వేర పార్టీ అధికారంలోకి రాదు, అలాంటపుడు పోటీ చేసి ఒకటి రెండు చోట్ల డివిజన్లు గెలుచుకున్నా టీయారెస్ లోకే మళ్ళీ జంప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫిరాయింపు అన్న మాట. ఈ మాత్రం దానికి టికెట్ ఇచ్చి పోటీకి పెట్టి ఇంత ఆయాసపడడం వేస్టే కదా.
అప్పటిదాకా అంతే …?
తెలంగాణాను మేము తెచ్చాం, మాకే పాలించే హక్కు ఉందని టీఆర్ఎస్ ఢంకా భజాయిస్తోంది. ఇక తెలంగాణాను ఇచ్చిన కాంగ్రెస్ కానీ, మద్దతు ఇచ్చిన బీజేపీ కానీ సోదిలోకి రాకుండా పోతున్నాయి. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతవరకూ ఆంధ్రా మూలాలు ఉన్న పార్టీలు తెలంగాణాలో ఎక్కడ నుంచి అయినా పోటీ చేయాలంటే సాహసం చేయాల్సిందే. పోటీ చేసినా గెలిచినవారు మళ్ళీ టీయారెస్ కే జై కొడతారు. దాన్ని కూడా భరించాలి. ఇక కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అధికారంలోకి వస్తే మాత్రం సీన్ వేరేగా ఉంటుంది. ఆ రెండూ జాతీయ పార్టీలు కావడం, వాటికి ఆంధ్రాతో కూడా రాజకీయ అవసరాలు ఉండడంతో ఆంధ్రా పార్టీలు తెలంగాణాలో రాజకీయ వాటా కోసం పోటీ పడేందుకు వీలు ఉంటుంది.
అంత సత్తా ఉందా…?
ఇక బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా తమకు తాముగా పొలిటికల్ స్పేస్ పెంచుకుని టీయారెస్ ని గద్దె దించే సత్తా సంపాదించాలి. వారు తమకు మద్దతుగా ఏ టీడీపీ, బీజేపీ, వైసీపీని పిలిచినా కూడా అసలుకే ఎసరు వస్తోంది. దాంతో ఈ రెండు పార్టీల మీద ఆంధ్రా ముద్ర వేసి కేసీయార్ తెలివిగా ఓటర్లను తన వైపు తిప్పుకుంటారు. ఇదీ ప్రస్తుతం తెలంగాణాలో రాజకీయ ముఖ చిత్రం. ఓ వైపు క్యాడర్ ఉన్నా ప్రకాకర్షణ కలిగిన లీడర్లు లేని దైన్యంలో కాంగ్రెస్ ఉంది. బీజేపీకి కొన్ని ప్యాకేట్లలో బలం తప్ప తెలంగాణా అంతటా ప్రభావం లేదు. పైగా ఈ రెండు పార్టీలు ఎప్పటికీ కలిసే సీన్ లేదు. ఇప్పటికైతే ఇది మారని సీన్. దాంతో టీఆర్ఎస్ రధం నల్లేదు మీద బండీలా సాగిపోవాల్సిందే.