గుడ్ సిఎం అనిపించుకునే తపనలో జగన్
ప్రజల సమస్యలు నేరుగా విని స్పందించే ముఖ్యమంత్రి వచ్చేశారు. ఆయనే ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రమాణ స్వీకారం ఇలా చేశారో లేదో తన [more]
ప్రజల సమస్యలు నేరుగా విని స్పందించే ముఖ్యమంత్రి వచ్చేశారు. ఆయనే ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రమాణ స్వీకారం ఇలా చేశారో లేదో తన [more]
ప్రజల సమస్యలు నేరుగా విని స్పందించే ముఖ్యమంత్రి వచ్చేశారు. ఆయనే ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రమాణ స్వీకారం ఇలా చేశారో లేదో తన ప్రసంగంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ పెట్టనున్నట్లు జగన్ ప్రకటించారు. ఆ కాల్ సెంటర్ ద్వారా ఏ సమస్య అయినా తనదృష్టికి నేరుగా వచ్చేలా వెంటనే వాటి పరిష్కారానికి యాక్షన్ లోకి దిగాలన్నది జగన్ సంకల్పం. ఆ చిత్తశుద్ధితో ప్రజల మనసును త్వరితగతినే దోచేసుకున్నారు ఆయన. కాల్ సెంటర్ ఇంకా పూర్తిస్థాయిలో మొదలు కాకుండానే తనకు వచ్చే ఫిర్యాదులపై పరిశీలన చేసి నేరుగా వాటిని అధికారుల దృష్టిలొ పెట్టి పరిష్కారానికి సూచనలు చేస్తున్నారు ఆయన. పాలన అంటే రాజకీయం కాదని జనహితం కోసం పనిచేయడమేనని చెప్పక చెబుతున్నారు ఆయన.
నర్సింగ్ కళాశాల సమస్య పై సీరియస్ …
చిత్తూరు జిల్లాలోని ఎస్వీఎస్ నర్సింగ్ కళాశాల లో విద్యార్థుల సమస్య సిఎం జగన్ కు చేరింది. దానిని అధ్యయనం చేసిన జగన్ మోహన్ రెడ్డి నేరుగా ఆ అంశాన్ని కలెక్టర్ల సమావేశం లో ప్రస్తావించారు. చిత్తూరు నర్సింగ్ కళాశాలలో నాలుగు సంవత్సరాల కు 200 లు మంది విద్యార్థులు వున్నారు. వీరికి ఇద్దరే ఫ్యాకల్టీలు ఉన్నారు. ఇలా ఉంటే ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి ? పేద విద్యార్థులు ఎక్కువగా నర్సింగ్ కళాశాలలో చేరుతున్నారు. కొన్ని కళాశాలలు కాసుల కోసం మాత్రమే విద్యా సంస్థలు ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి. కనుక వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అంటూ అధికారులను ఆదేశించారు జగన్.
గత సర్కార్ కు భిన్నంగా ….
గతంలో చంద్రబాబు సర్కార్ తీరుకు పూర్తి భిన్నంగా తన మార్క్ తో పాలన సాగిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. సమస్యలను నాన్చకుండా ఎప్పటికప్పడు ఆయన వాటి పరిష్కారానికి వెంటనే చర్యలకు దిగుతూ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు తీసుకోవడంతో పాటు వాటిని పరిశీలించడం సత్వరం న్యాయం చేసేందుకు ప్రయత్నం చేయడం మంచి ఫలితాలే ఇస్తుంది. వైసిపి అధినేత పై వ్యక్తిగతం గా టిడిపి చేసిన ప్రచారం అసత్యమేనని నిరూపించుకోవడంతో పాటు పాలనలో తనకో బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకునేందుకు జగన్ ఆరాటపడుతున్నారు. ఐదేళ్లపాటు విపక్షంలో ఉండటంతో ఎలా పాలన చేయాలి ? ఎలా చేయకూడదు అన్న దానిపై పూర్తి క్లారిటీ జగన్ మోహన్ రెడ్డి కి ఏర్పడటం వల్లే మెరుపు నిర్ణయాలు ఆయన తీసుకోగలుగుతున్నారని సమస్యపై తక్షణమే స్పందించడం తో ఎపి సిఎం పాలనకు ప్రజల్లో మంచి మార్కులే సర్కార్ మొదలైన నెలరోజుల్లోనే వస్తున్నాయని అంటున్నారు.