ఈ స్వామి దిగారు.. ఇక సెట్ అవుతుందా?
రాష్ట్రంలో ఇపుడు దేవతా మూర్తుల విద్వంశ రచన అతి పెద్ద టాపిక్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందూ సమాజ చైతన్యం కోరుతూ [more]
రాష్ట్రంలో ఇపుడు దేవతా మూర్తుల విద్వంశ రచన అతి పెద్ద టాపిక్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందూ సమాజ చైతన్యం కోరుతూ [more]
రాష్ట్రంలో ఇపుడు దేవతా మూర్తుల విద్వంశ రచన అతి పెద్ద టాపిక్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందూ సమాజ చైతన్యం కోరుతూ పెద్ద ఎత్తున పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. ఏపీలో సామాజిక మార్పు ఇంత వేగంగా జరుగుతుందా అని ఆలోచించేవారికి కూడా షాక్ ఇచ్చేలా హిందూ చైతన్యం కనిపిస్తోంది. మన ఆలయాలను, దేవుళ్ళను మనమే కాపాడుకోవాలి. హిందూ మతం అంటే అంత చిన్న చూపా అంటూ పోస్టింగులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఇలాంటివి ఏపీలో మారుతున్న సామాజిక చిత్రానికి అద్దం పడుతున్నాయి.
బీజేపీకి వరంగా …
డాక్టర్ కోరుకున్నది రోగి కోరుకున్నాది ఒక్కటే అని ఒక సామెత. తెలంగాణాలో కాషాయం పార్టీకి కాసింత కళ కనిపించింది. ఏపీలో కూడా ఎంతో కొంత అడుగులు నెమ్మదిగా పడతాయనే అనుకున్నారు కానీ ఇంత తొందరగా మార్పు వస్తుందని ఎవరూ ఊహించలేదు. దానికి వరసపెట్టి జరుగుతున్న విగ్రహాల విద్వంశం ఒక ప్రధాన కారణం అయితే ఇంతకాలం స్తబ్దుగా ఉన్న టీడీపీ అనుకూల మీడియా దానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడం మరో కారణం. నిజానికి చంద్రబాబు టైంలో కూడా దేవతా విగ్రహాల మీద దాడులు జరిగాయి. ఆలయాలను కూలగొట్టారు. నాడు రాని ప్రచారం నేడు వచ్చింది అంటే వైసీపీ యాంటీ మీడియా ఏపీలో బలంగా ఉండడమే. ఇది బీజేపీకి అనుకోని వరంగా మారుతోంది అంటున్నారు.
పోలరైజ్ అవుతారా..?
దాంతో ఏపీలో హిందువులు సంఘటితం అవుతారా అన్న చర్చ ఒకటి బయలుదేరింది. ఇపుడు ఏపీలో ఒక్కసారిగా సంక్షేమ కార్యక్రమాల మీద చర్చ ఆగిపోయింది. కరోనా వార్తలు కనిపించడం లేదు, వ్యాక్సిన్ వస్తుందా రాదా అన్న చర్చ అంతకంటే లేదు. టీవీ చానళ్ళలో ఒకటే డిబేట్ కనిపిస్తోంది. హిందూత్వ దిశగా ఆ చర్చలు సాగడం గమనార్హం. ఏపీలో క్రిస్టియన్ మతాన్ని విశ్వసించే ముఖ్యమంత్రి జగన్ ఉన్నాడని పదే పదే విపక్షాలు ఎత్తి చూపడం వల్ల ఓ వర్గం వారిలో ఆగ్రహం పెల్లుబికేలా ప్రచారం సాగిస్తున్నారు.
ఆదుకుంటారా ..?
మొత్తానికి ఏమీ కాదులే అని ఇంతకాలం లైట్ తీసుకున్న జగన్ కి క్షేత్ర స్థాయిలో వేగంగా మారుతున్న పరిణామాలు అర్ధమవుతున్నాయట. దాంతో చిన జీయర్ స్వామి వద్దకు అర్జంటుగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెళ్ళడం ఆసక్తిని కలిగిస్తోంది. త్వరలో ఏపీలో ఆలయాలను సందర్శిస్తానని, విద్వంసం జరిగిన దేవతా మూర్తులను పరిశీలిస్తామని జీయర్ స్వామి ఈ మధ్యనే ప్రకటించారు. ఈ క్రమంలో హడావుడిగా ఆయన్ని వైవీ సుబ్బారెడ్డి కలవడం అంటే జగన్ తరఫునే ఆయన వచ్చారని ప్రచారం సాగుతోంది. ఏపీలో ఆగ్రహంగా ఉన్న హిందూ సమాజాన్ని శాంతింపచేసేలా చూడడంతో పాటు, ప్రభుత్వం ఈ సమస్య నుంచి బయట పడే మార్గాలను కూడా సూచించాలని సుబ్బారెడ్డి జీయర్ స్వామిని కోరినట్లుగా చెబుతున్నారు. జగన్ కి జీయర్ స్వామికి గతంలో ఉన్న పరిచయాల నేపధ్యంలోనే తన సొంత బాబాయ్ ని పంపించారని అంటున్నారు. స్వామీజీ సూచించే దాన్ని ప్రభుత్వం తూచా తప్పకుండా చేస్తుందని కూడా సుబ్బారెడ్డి హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరి జీయర్ స్వామి రంగంలోకి దిగితే ఏపీలో పరిస్థితి అదుపులోకి వస్తుందా. ఆయన హిందూ సమాజానికి ప్రభుత్వానికీ కూడా ఏ సందేశం ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.