బీకాంలో ఫిజిక్స్.. పక్క చూపులు.. ఛాన్స్ దక్కుతుందా..?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నాయకుల చిత్తాలు ఎప్పుడు ఎలా మారతాయో కూడా తెలియదు. అవకాశం.. అవసరం.. అనే రెండు అంశాలే కీలకంగా నాయకులు [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నాయకుల చిత్తాలు ఎప్పుడు ఎలా మారతాయో కూడా తెలియదు. అవకాశం.. అవసరం.. అనే రెండు అంశాలే కీలకంగా నాయకులు [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నాయకుల చిత్తాలు ఎప్పుడు ఎలా మారతాయో కూడా తెలియదు. అవకాశం.. అవసరం.. అనే రెండు అంశాలే కీలకంగా నాయకులు ముందుకు సాగుతారు. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తే.. అటు మళ్లడం నాయకులకు ఇటీవల కాలంలో అలవాటై పోయింది. ఇలాంటి ధోరణిని అనుసరించే నాయకులు చాలా మందే ఉన్నారు. వీరిలో విజయవాడకు చెందిన మైనార్టీ వర్గానికి చెందిన నేత, సీనియర్ మోస్ట్ నాయకుడు జలీల్‌ఖాన్ కనిపిస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన జలీల్ ఖాన్ నగరంలో ఒకప్పుడు చక్రం తిప్పారు. కాంగ్రెస్‌లో ఉన్నసమయంలో ఆయన వైఎస్‌కు ఆత్మీయుడిగా కూడా ముద్ర వేసుకున్నారు.
వరసగా పార్టీలు మారి….
అయితే, తర్వాత కాలంలో ఆయన అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్)తో తీవ్ర విభేదాలు కొని తెచ్చుకున్నారు. 2004లో నాడు విజయవాడ పశ్చిమ సీటును కమ్యూనిస్టు కోటాలో భాగంగా బేగ్‌కు కేటాయించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన జలీల్ ఖాన్ ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్.. చివరకు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలోకి జంప్ చేశారు. ఈ క్రమంలోనే 2014లో పశ్చిమ నియోజకవర్గం నుంచి జలీల్ ఖాన్ విజయం సాధించారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు ఆకర్ష్ మంత్రానికి చిక్కుకున్నారు.
ఎంపీ పక్కన పెట్డడంతో…
మంత్రి పదవిపై మోజుతో జలీల్ ఖాన్.. టీడీపీ కండువా కప్పుకొన్నారు. అయితే, ఆయనకు లక్కు చిక్కలేదు. ఆయన నోటి దురదతో తెచ్చుకున్న బీకాంలో ఫిజిక్స్ చదివాననే వ్యాఖ్యలు ఆయన కొంప ముంచాయి. ఇదిలావుంటే, గత ఏడాది ఎన్నికల్లో ఆయన తప్పుకొని ఆయన కుమార్తె షబానా ఖతూన్‌ను రంగంలో కి తెచ్చారు. అయితే, ఆమె ఓటమి చెందడంతో జలీల్ ఖాన్ పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పడింది. విజయవాడలో ఇప్పుడు ఆయన హవా ఎక్కడా కనిపించడం లేదు. పైగా ఎంపీ కేశినేని నాని వర్గంలో చేరడంతో మైనార్టీ నాయకులు జలీల్‌ను పట్టించుకోవడం మానేశారనే టాక్ వస్తోంది.
అవసరాన్ని బట్టి మాత్రమే…
దీనికితోడు టీడీపీలోనూ హవా కనిపించడం లేదు. ఇక, పశ్చిమలో జలీల్ ఖాన్ పేరు వినిపించకుండా చేసేలా మంత్రి వెలంపల్లి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. మైనార్టీ వర్గాలకు మరింత చేరువ అవుతున్నారు. ఈ క్రమంలోనే జలీల్ ఖాన్ తన ఫ్యూచర్‌పై బెంగ పెట్టుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా టీడీపీలోనే ఉంటే పరిస్థితి మరింత విషమిస్తుందని భావించిన ఆయన మళ్లీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబందించిన చర్చలు కూడా సాగాయని, అయితే, జగన్‌ను గతంలో తిట్టిపోసిన నేపథ్యంలో కొందరు నాయకులు జలీల్ ఖాన్ కు అడ్డు తగులుతున్నారని అంటున్నారు. ఇక ఇప్పటికీ ఓ మోస్తరు వర్గాన్ని మెయింటైన్ చేస్తోన్న ఆయన్ను వైసీపీ అవసరాన్ని బట్టి మాత్రమే పార్టీలో చేర్చుకోవాలని చూస్తోందట. మరి బీకాంలో ఫిజిక్స్ పక్క చూపులు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.