ఎదురెళ్ళారు…. గిన్నిస్ సాధించారు …!!
తమిళనాడు అనగానే జల్లికట్టు గుర్తొస్తుంది దేశవాసులకు. ధైర్య సాహసాలతో కూడిన ఈ క్రీడ తమిళుల సాంప్రదాయ లో భాగమైంది. జల్లికట్టు పోటీలపై నిషేధాన్ని సుప్రీం కోర్టు విధించినా [more]
తమిళనాడు అనగానే జల్లికట్టు గుర్తొస్తుంది దేశవాసులకు. ధైర్య సాహసాలతో కూడిన ఈ క్రీడ తమిళుల సాంప్రదాయ లో భాగమైంది. జల్లికట్టు పోటీలపై నిషేధాన్ని సుప్రీం కోర్టు విధించినా [more]
తమిళనాడు అనగానే జల్లికట్టు గుర్తొస్తుంది దేశవాసులకు. ధైర్య సాహసాలతో కూడిన ఈ క్రీడ తమిళుల సాంప్రదాయ లో భాగమైంది. జల్లికట్టు పోటీలపై నిషేధాన్ని సుప్రీం కోర్టు విధించినా మూడేళ్లు పాటు న్యాయపోరాటం చేసి కొన్ని నిబంధనలతో అమలయ్యేలా ఉద్యమించారు తమిళులు. అలాంటి ఈ క్రీడలో తమకు తొడకొట్టే వారే ప్రపంచంలో లేరని చాటిచెప్పేందుకు ఒక వినూత్న భారీ కార్యక్రమం తలపెట్టింది తమిళనాడు. అరుదైన రికార్డ్ నెలకొల్పి అందరి ప్రశంసలు అందుకున్నారు తమిళ యువత. ఆ రికార్డ్ గిన్నిస్ కావడం ఒక్క తమిళనాడుకే కాదు దేశవాసులకు గర్వకారణమని చాటిచెప్పారు.
ఇలా చేశారు….
జల్లికట్టులో తమకు తామే సాటి అని చెప్పేందుకు ఒక భారీ ఫీట్ చేసేందుకు సిద్ధమైంది తమిళనాడు యువత. వెంటనే దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించింది. స్వయంగా ముఖ్యమంత్రి పళనిస్వామి వారి కార్యక్రమానికి ప్రోత్సహిస్తూ మెగా ఈవెంట్ ను ప్రారంభించారు. గిన్నిస్ బుక్ ప్రతినిధులుగా ముగ్గురు, విదేశాల నుంచి మరో ముగ్గురు న్యాయనిర్ణేతలు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. 2500 ల ఎద్దులు 3000 లమంది యువకులతో తలపడ్డాయి. వాటి పొగరును తమ సాహసంతో దించేశారు. అరుదైన అద్భుతమైన రికార్డ్ ను అందుకోవడంతో ఈ ఫీట్ లో గిన్నిస్ రికార్డ్ నమోదైపోయింది. రెప్పవేయకుండా సాగే ఈ సాంప్రదాయ క్రీడను రికార్డ్ తిలకించేందుకు సింగపూర్, కెనడా, మలేసియా ల నుంచి కూడా అనేకమంది తరలి రావడం విశేషం.