జనసేన రెడీ నేనా …?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసిపికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే రేసులో రెండు పార్టీలు ఆరాట పడుతున్నాయి. ఇందులో ముందు వరుసలో వుంది బిజెపి. ఇక పవన్ జనసేన [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసిపికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే రేసులో రెండు పార్టీలు ఆరాట పడుతున్నాయి. ఇందులో ముందు వరుసలో వుంది బిజెపి. ఇక పవన్ జనసేన [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసిపికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే రేసులో రెండు పార్టీలు ఆరాట పడుతున్నాయి. ఇందులో ముందు వరుసలో వుంది బిజెపి. ఇక పవన్ జనసేన తరువాత ప్లేస్ లో వుంది. టిడిపి ని నామరూపాలు లేకుండా చేయగలిగితేనే ఇది సాధ్యం అవుతుంది. మరోపక్క అధికారపార్టీపై కూడా దుమ్మెత్తి పోస్తూ ఉండాలి. ఇలా ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతూ బలమైన నేతలను పార్టీలో చేర్చుకుంటూ ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ దూసుకుపోవాలి. ఇప్పుడు ఆ పనిలో వేగంగా వెళుతున్నది ఒక్క బిజెపినే. ఇక టిడిపి తన అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు తమదైన శైలిలో వెళుతున్నా అతి తక్కువ సంఖ్యలో ఎమ్యెల్యేల సంఖ్య ఉండటంతో బాటు ముఖ్యమైన నేతలు కమలంలోకి వెళుతుండటంతో డీలా పడుతుంది తెలుగుదేశం.
బిజెపితో పోటీ పడగలదా …?
కేంద్రంలో బిజెపి అధికారంలో వుంది. టిడిపి విపక్ష పాత్రలో వుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరిని ఢీకొట్టడం అంత ఈజీకాదు జనసేనకు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నా ప్రజల్లోకి నేరుగా ఇంకా పవన్ పార్టీ మిళితం కాలేకపోతుంది. ప్రజాక్షేత్రంలో నిత్యం వుండాలిసిన జనసేన జోరు పెంచలేదు. మరోపక్క పార్టీ ఘోరఓటమి తరువాత ఒక్కొరొక్కరుగా ముఖ్య నేతలు జనసేనకు గుడ్ బై కొట్టేస్తున్నారు. దాంతో జనసేనాని సీరియస్ గా దృష్టి సారించారు.
ఇక యాక్షన్ లోకి దిగకపోతే ….
పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు తో బాటు పలు కమిటీలను తన కోటరీ లోని వారికి పదవులు కట్టబెట్టారు. అయితే ఇవేమి జనసేన కు రాజకీయంగా సరిపోవు. బిజెపి అయితే ఏ మాత్రం అటు అధికారపార్టీని ఇటు టిడిపి ని ఎండగడుతూ వ్యూహాత్మకంగా నడుస్తుంది. ఈ స్థాయిలో జనసేన గట్టిగా రెండు పార్టీలపై విమర్శల దాడి చేయలేకపోతోంది. మరోపక్క ఎవరు వచ్చినా పార్టీలోకి వారిని చేర్చుకుని బలం పెంచుకునేందుకు కదులుతుంది కాషాయ పార్టీ. కానీ జనసేన ఉన్న నేతలను కాపాడుకోలేక పోతుంది. బలమైన క్యాడర్ వున్నవారిని ఆకర్షించే వ్యూహం లేక చతికిల పడుతుంది. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ అఫైర్స్ కమిటీతో భేటీ అయిన పవన్ దిశా దశా నిర్ధేశించారు. అయితే పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ చేసుకోవడంలో మాత్రం ఇంకా జనసేన పూర్తిగా సఫలం కాలేకపోతుంది. రాబోయే రోజుల్లో అయినా పవన్ ఏపీలో ద్వితీయ ప్రత్యామ్నాయం తామే అని నిరూపించుకుంటారో లేదో చూడాలి.