పవన్…. ఇలా చేశావేంటి?
జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్న డబుల్ పాలిటిక్స్ అదిరాయంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా ఏపీపై అవ్యాజమైన ప్రేమ చూపించిన పవన్.. అదే సమయంలో ఎన్నికలకు ముందు తెలంగాణలో ఆంధ్రవాళ్లను [more]
జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్న డబుల్ పాలిటిక్స్ అదిరాయంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా ఏపీపై అవ్యాజమైన ప్రేమ చూపించిన పవన్.. అదే సమయంలో ఎన్నికలకు ముందు తెలంగాణలో ఆంధ్రవాళ్లను [more]
జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్న డబుల్ పాలిటిక్స్ అదిరాయంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా ఏపీపై అవ్యాజమైన ప్రేమ చూపించిన పవన్.. అదే సమయంలో ఎన్నికలకు ముందు తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొడుతున్నారంటూ.. కన్నీరు పెట్టుకున్నంత పనిచేశారు. పాపం తన సెంటిమెంటు డైలాగులకు ఏపీ ప్రజలు పడిపోయారని అనుకున్నారు. అయితే, అప్పట్లోనే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ప్రజల నుంచి రెండు రకాల వ్యాఖ్యలు కౌంటర్‌గా వినిపించాయి. అంత ప్రేమ ఏపీవారిపై ఉంటే.. అక్కడ ప్రశ్నించరాదా? అంటూ కొందరు వ్యాఖ్యానాలు చేస్తే.. మరికొందరు అయితే, ఇక్కడే ఉండిపోరాదే.. అక్కడ ఇళ్లు అమ్మేయరాదే.. అంటూ కామెంట్లు కుమ్మరించారు.
ఉప ఎన్నికలో మాత్రం…
ఇంత వరకు బాగానే ఉంది. అయితే, ఇప్పుడు ఇదే పవన్ తెలంగాణలో త్వరలోనే జరగనున్న ఉప ఎన్నికల్లో తన వ్యూహాన్ని అమలు చేశారు. తెలంగాణలో హుజూర్‌నగర్‌కు ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో ఇక్కడ దాదాపు అన్ని పార్టీలూ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరి వ్యూహం వారిదే. టీడీపీ, టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇలా ఎవరికి వారు పోటీ చేస్తున్నారు. సీపీఐ మాత్రం అధికార కేసీఆర్‌కు మద్దతిస్తోంది. ఇంత వరకు బాగానే ఉంది. అయితే, వీరు ఏపీలోకి వచ్చి.. ఎక్కడా తెలంగాణలో ఆంధ్రులపై దాడి జరుగుతోందని, అక్కడి ఏపీ వారు తనకు చెబుతున్నారని కానీ.. ఎక్కడా ప్రచారం చేసుకోలేదు.
కాంగ్రెస్ కు మద్దతుగా…
కానీ, ఎటొచ్చీ.. ఏపీలో తెలంగాణపై ద్వేషం కలిగించేలా.. తనది ఏపీనేనని చెప్పుకొనేందుకు ఉత్సాహం చూపిన నాయకుడు ఎవరైనా ఉంటే.. ఆయన కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈయన డబుల్ పాలిటిక్స్‌కు తెరదీశారు. తెలంగాణలోని హుజూర్‌నగర్‌కు జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పవన్ మద్దతిస్తున్నారు. ఇది సంచలనమా? కాదా? అనే విషయాన్ని పక్కన పెడితే. తాను ఇప్పటి వరకు తెలంగాణ వారిని తిట్టి.. ఏపీవారితో శత్రువులుగా పోల్చి రాజకీయం చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు రెడీ అయ్యారు. దీంతో తస్సాదియ్యా.. జనసేనాని మంచి పాలిటిక్సే చేస్తున్నాడని అన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.