చేరికలకు దూరంగా… రీజన్ ఏంటంటే?
ఏదైనా రాజకీయ పార్టీకి చేరికలు బలం చేకూరుస్తాయి. ఆర్థికంగా, సామాజికపరంగా బలమైన నేతలు వచ్చి చేరితే ఆ పార్టీ కనీసం నియోజకవర్గ స్థాయిలోనైనా బలపడుతుంది. త్వరలోనే జమిలి [more]
ఏదైనా రాజకీయ పార్టీకి చేరికలు బలం చేకూరుస్తాయి. ఆర్థికంగా, సామాజికపరంగా బలమైన నేతలు వచ్చి చేరితే ఆ పార్టీ కనీసం నియోజకవర్గ స్థాయిలోనైనా బలపడుతుంది. త్వరలోనే జమిలి [more]
ఏదైనా రాజకీయ పార్టీకి చేరికలు బలం చేకూరుస్తాయి. ఆర్థికంగా, సామాజికపరంగా బలమైన నేతలు వచ్చి చేరితే ఆ పార్టీ కనీసం నియోజకవర్గ స్థాయిలోనైనా బలపడుతుంది. త్వరలోనే జమిలి ఎన్నికలు ఉంటాయన్న ఊహాగానాలు వినపడుతున్నాయి. అయితే జనసేన మాత్రం చేరికలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాయకత్వంపై నమ్మకం లేకనే చేరికలు ఉండటం లేదా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
క్యాష్ చేసుకోవాల్సిన సమయంలో…..
జనసేన పార్టీ ఆవిర్భవించి దాదాపు ఏడేళ్లు పూర్తి కావస్తుంది. 2019 ఎన్నికల్లో జనసేన ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగింది. గత ఎన్నికల్లో ఒకే ఒక స్థానంలో జనసేన విజయం సాధించింది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, విపక్ష తెలుగుదేశం పార్టీ బలహీన పడటం వంటి అంశాలను జనసేన పార్టీ క్యాష్ చేసుకోలేకపోతుందంటున్నారు. ఎన్నికలు ముగిసి ఇరవై నెలలు గడుస్తున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా జనసేనలో చేరలేదు.
అనేక నియోజకవర్గాల్లో….
రాజోలు నియోజకవర్గంలో జనసేన గెలిచినా అక్కడ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీని వీడిపోయారు. ఇప్పుడు అక్కడ కూడా జనసేనకు అభ్యర్థి లేరు. ఇలా అనేక నియోజకవర్గాల్లో జనసేనకు అభ్యర్థులు లేరనే చెప్పాలి. గత ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేసి ఓటమి పాలయి కోట్ల రూపాయల సొమ్మును పోగొట్టుకున్న నేతలు ఇప్పుడు పార్టీకి దూరమయ్యారు. వారి స్థానంలో కూడా కొత్త వారిని ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది.
నమ్మకం లేకనేనా?
అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మిత్రపక్షమైన బీజేపీ మాత్రం చేరికలను ప్రోత్సహిస్తుంది. కానీ జనసేన మాత్రం చేరికలపై ఎలాంటి దృష్టి సారించడం లేదు. పవన్ కల్యాణ్ ది నిలకడలేని మనస్తత్వం కావడంతో ఎన్నికలకు ముందు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో తెలియని పరిస్థితి. అందుకే జనసేనలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్న కామెంట్స్ పార్టీ నుంచే వినపడుతున్నాయి. ఇలాగే కొనసాగితే జనసేన పరిస్థితి ఏంటన్నది ఆ పార్టీ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న.