janasena : పోటీ చేయమ్మా… ఖర్చంతా మేమే భరిస్తాం
బద్వేలులో పోట ీ చేయాలా? వద్దా? అన్న దానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బద్వేలు ఉప [more]
బద్వేలులో పోట ీ చేయాలా? వద్దా? అన్న దానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బద్వేలు ఉప [more]
బద్వేలులో పోట ీ చేయాలా? వద్దా? అన్న దానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బద్వేలు ఉప ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అయితే బీజేపీ కే వదిలేయాలని కొంత మంది నేతలు పవన్ కల్యాణ్ కు సూచిస్తున్నారు. కానీ పోటీ చేయకుండా వదిలేస్తే వెనక్కు తగ్గినట్లవుతుందని, అభ్యర్థిని ఎంపిక చేసేందుకు రెండు, మూడు పేర్లను పవన్ కల్యాణ్ సూచించినట్లు తెలిసింది.
పరిశీలనలో పేర్లు….
బీజేపీ తాము పోటీ చేయమని చెబితే అప్పటికప్పుడు అభ్యర్థిని వెతుక్కోవడం కన్నా ముందుగానే కొందరి పేర్లను పరిశీలించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా విజయజ్యోతి పేరును కొందరు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. విజయజ్యోతి వాస్తవానికి తెలుగుదేశం పార్టీ నేత. ఆమె 2014 ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పదివేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
టీడీపీ మాజీ నేత…
ికానీ 2019 ఎన్నికల్లో బద్వేలు టీడీపీ టిక్కెట్ ఆమెకు దక్కలేదు. దీంతో విజయజ్యోతి ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి విజయజ్యోతి దూరంగా ఉంటున్నారు. విజయజ్యోతి కాశినాయన మండలంలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే కొంతకాలంగా జనసేన పార్టీ వైపు ఆమె చూస్తున్నారని చెబుతున్నారు.
ఆమె అంగీకరిస్తే…..?
దీంతో విజయజ్యోతి పేరును జనసేన తరుపున ఖరారు చేసే అవకాశముంది. అయితే టీడీపీ మూలాలు ఉండటంతో పవన్ కల్యాణ్ దీనికి అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే కొందరు జనసేన నేతలు విజయజ్యోతితో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. ఎన్నికల ఖర్చు మొత్తం తామే భరిస్తామని కూడా ఆమెకు నచ్చ చెబుతున్నారు. అయితే ఆమె అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.