పవన్…. వంద రోజుల పండగ….!!
సినిమాలు వందరోజులు ఆడితే ఫంక్షన్ చేస్తారు. అలాగే సినీ రంగం నుంచి వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనూ హండ్రెడ్ డేస్ ను మర్చిపోయినట్లు లేదు. [more]
సినిమాలు వందరోజులు ఆడితే ఫంక్షన్ చేస్తారు. అలాగే సినీ రంగం నుంచి వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనూ హండ్రెడ్ డేస్ ను మర్చిపోయినట్లు లేదు. [more]
సినిమాలు వందరోజులు ఆడితే ఫంక్షన్ చేస్తారు. అలాగే సినీ రంగం నుంచి వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనూ హండ్రెడ్ డేస్ ను మర్చిపోయినట్లు లేదు. అందుకే ఆయన వందరోజుల ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. వందరోజుల్లో అన్ని నియోజకవర్గాలను చుట్టి రావాలన్నది పవన్ కల్యాణ్ నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాలను వందరోజుల్లో పర్యటించాలన్నది పవన్ కల్యాణ్ ప్లాన్. కేవలం పర్యటనలతో సరిపెట్టకుండా ఆ యా నియోజకవర్గాల్లో క్యాడర్ తో పాటు లీడర్లను ఎంపిక చేయాలన్న లక్ష్యంతో పవన్ పర్యటన సాగనున్నట్లు తెలుస్తోంది.
అమరావతికి మకాం మార్చి….
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు.తొలుత ఒంటరిగా పోటీ చేయాలని భావించినా తర్వాత కలసి వచ్చే పార్టీలతో ఎన్నికల గోదాలోకి దిగాలని పవన్ నిర్ణయించారు. సీపీఐ, సీపీఎం, లోక్ సత్తా వంటి పార్టీలతో పవన్ జత కట్టనున్నారు. ప్రధానం అరవై నుంచి 70 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి హిట్ కొట్టాలన్నది పవన్ వ్యూహంగా తెలుస్తోంది. అందుకే కొత్త ఏడాది తొలి రోజునుంచే పవన్ తన మకాంను అమరావతికి మార్చేశారు. ఇక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ పవన్ ఏపీలోనే ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.
175 నియోజకవర్గాల్లో…..
ఇప్పటికే పవన్ ఆరు జిల్లాల్లో పోరాట యాత్ర పేరుతో పర్యటనలు చేసి వచ్చారు. అయితే ఈ జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాలను టచ్ చేయలేదు. దీంతో మరోసారి 13 జిల్లాల్లో పర్యటించాలని పవన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వందరోజుల్లో 175 నియోజకవర్గాల్లో పర్యటన కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. పార్టీలో యాక్టివిటీని పెంచడం ద్వారా ప్రజల్లో విశ్వాసం కల్గించాలని పవన్ భావిస్తున్నారు. పార్ట్ టైం పొలిటిషయన్ అనే పేరును చెరుపుకునేందుకు ఈ ఐదునెలలు పవన్ శ్రమించనున్నారు.
క్యాడర్ కు చేరువగా….
పార్టీ సిద్ధాంతాలు, మ్యానిఫేస్టోతో పాటు ముఖ్యంగా గుర్తును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంది. జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం కూడా విజయవాడలో ప్రారంభమైంది. పవన్ జిల్లాల పర్యటనలకు వెళ్లినా ముఖ్యనేతలు ప్రధాన కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండేలా పవన్ చర్యలు తీసుకున్నారు.క్యాడర్ కు , నేతలకు అందుబాటులో ఉండటం, వారికి అవసరమైన సలహాలు,సూచనలు ఇచ్చేందుకు ముఖ్యనేతలను విజయవాడలోనే పవన్ ఉంచుతున్నారు. ఇక చేరికలపై కూడా పవన్ దృష్టి పెట్టారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలతో పాటు ప్రధాన పార్టీల నేతలు కూడా జనసేనలోకి వచ్చేందుకు మొగ్గు చూపుతుండటంతో పవన్ వారిని విడతల వారీగా పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్దమయిపోయారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ వంద రోజుల టూర్ ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచనుందనే చెప్పాలి.
- Tags
- ap politics
- hundred days
- janasena party
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°ªà± పాలిà°à°¿à°à±à°¸à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నారా à°à°à°¦à±à°°à°¬à°¾à°¬à±à°¨à°¾à°¯à±à°¡à±
- పవనౠà°à°²à±à°¯à°¾à°£à±
- à°µà°à°¦à°°à±à°à±à°²à±
- à°µà±.à°à°¸à±. à°à°à°¨à±à°®à±à°¹à°¨à± à°°à±à°¡à±à°¡à°¿
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±