కాంప్రమైజ్ కాక తప్పేట్లు లేదే…..!!!
కర్ణాటక రాష్ట్రంలో జనతాదళ్ ఎస్, స్థానిక కాంగ్రెస్ నేతలు సీట్ల సర్దుబాటులో ఒకరి మీద మరొరకరు పై చేయి సాధించాలనుకుంటున్నారు. ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు [more]
కర్ణాటక రాష్ట్రంలో జనతాదళ్ ఎస్, స్థానిక కాంగ్రెస్ నేతలు సీట్ల సర్దుబాటులో ఒకరి మీద మరొరకరు పై చేయి సాధించాలనుకుంటున్నారు. ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు [more]
కర్ణాటక రాష్ట్రంలో జనతాదళ్ ఎస్, స్థానిక కాంగ్రెస్ నేతలు సీట్ల సర్దుబాటులో ఒకరి మీద మరొరకరు పై చేయి సాధించాలనుకుంటున్నారు. ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని తేలిపోవడం, రాష్ట్రంలో సంకీర్ణ సర్కార్ ఉండటంతో ఎవరూ సీట్ల విషయంలో సీరియస్ కాబోరన్నది రెండు పార్టీల వ్యూహంగా కన్పిస్తుంది. సీట్ల సర్దుబాటులో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తితే అది సంకీర్ణ సర్కార్ కే ముప్పు వాటిల్లతుంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ ను రెండు, మూడు సార్లు అమలు పర్చిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప అందుకోసం రెడీగా ఉన్నారు.
పది సీట్లిచ్చినా…..
జనతాదళ్ ఎస్ దేవెగౌడ తమకు పది స్థానాలు కావాలని గట్టిగానే కోరుతున్నారు. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో జరిపిన భేటీలో సయితం ఆయన తమకు పదికి తగ్గకుండా స్థానాలను కేటాయించాలని కోరారు. రాహుల్ కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. తాము తొలి నుంచి పన్నెండు సీట్లు అడుగుతున్నామని, అయితే పొత్తు ధర్మంలో భాగంగా తమకు పది సీట్లిచ్చినా చాలునని జనతాదళ్ ఎస్ అంటోంది. ఈ మేరకు వారు పది స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో మునిగిపోయి ఉన్నారు.
ఆరింటిలో మాత్రమే……
మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా అదే పనిలో ఉన్నారు. బలం లేని ప్రాంతంలో పోటీ చేయడమెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ క్యాడర్ నుంచి వస్తున్న ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారంటున్నారు. అందుకే కాంగ్రెస్ ముందస్తు ఎత్తుగడలో భాగంగా 25 స్థానాల వరకూ అభ్యర్థులను ఎంపిక చేసి రెడీగా పెట్టుకుంది. జనతాదళ్ ఎస్ కు ఆరు స్థానాలకు మించి ఇవ్వలేమని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మాండ్య, హాసన్, శివమొగ్గ స్థానాలకు మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థుల పేర్లను సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఉంచడం విశేషం.
పూర్తి స్థాయి నివేదికలతో…..
నియోజకవర్గాల వారీగా బలాబలాలు, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం, బీజేపీ బలం, బలహీనత పూర్తి స్థాయి సమాచారంతో కాంగ్రెస్ నేతలు నివేదికలు రెడీ చేసి పెట్టుకున్నారు. రాహుల్ నుంచి ఎప్పుడు పిలుపు వచ్చినా తమ బలాన్ని చూపించేందుకు కాగితాల రూపంలో సిద్ధం చేసి పెట్టుకున్నారు. కొన్ని సీట్లను జనతాదళ్ ఎస్ కు ఇస్తే కాంగ్రెస్ క్యాడర్ పనిచేయదన్న విషయాన్ని కూడా రాహుల్ కు చెప్పనున్నారు. దేవెగౌడ పార్టీ బలంగా ఉన్న ఆరు స్థానాలను మాత్రమే ఇచ్చేందుకు తాము సిద్ధమని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. మొత్తం మీద సంకీర్ణ సర్కార్ కు సారథిగా ఉన్న కుమారస్వామి సీట్ల పంపకాల్లో కాంప్రమైజ్ కాక తప్పదన్నది కాంగ్రెస్ నేతల ఆలోచనగా ఉంది.
- Tags
- amith shah
- b.s. yadurppa
- bharathiya janatha party
- devegouda
- indian national congress
- janathadal s
- karnataka
- kumara swamy
- narendra modi
- rahulgandhi
- sidharamaiah
- ఠమితౠషా
- à°à°°à±à°£à°¾à°à°
- à°à±à°®à°¾à°°à°¸à±à°µà°¾à°®à°¿
- à°à°¨à°¤à°¾à°¦à°³à± à°à°¸à±
- à°¦à±à°µà±à°à±à°¡
- నరà±à°à°¦à±à°° à°®à±à°¦à±
- బి.à°à°¸à±.యడà±à°¯à±à°°à°ªà±à°ª
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- రాహà±à°²à± à°à°¾à°à°§à±
- సిదà±à°§à°°à°¾à°®à°¯à±à°¯