అరుదైన నేతకు ఇదా గౌరవం.. రెడ్డి అనేనా?
ఏదైనా శృతి మించ కూడదు. నమ్మి ఉన్నారు కదా? అని వారిని నట్టేట ముంచకూడదు. కానీ జగన్ ఒక నేత విషయంలో మాత్రం తప్పు చేశారని అంటున్నారు. [more]
ఏదైనా శృతి మించ కూడదు. నమ్మి ఉన్నారు కదా? అని వారిని నట్టేట ముంచకూడదు. కానీ జగన్ ఒక నేత విషయంలో మాత్రం తప్పు చేశారని అంటున్నారు. [more]
ఏదైనా శృతి మించ కూడదు. నమ్మి ఉన్నారు కదా? అని వారిని నట్టేట ముంచకూడదు. కానీ జగన్ ఒక నేత విషయంలో మాత్రం తప్పు చేశారని అంటున్నారు. ఆ నేత రెడ్డి కులంలో పుట్టడమే నేరంగా భావించి జగన్ పదవులకు దూరంగా ఉంచారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధించిన చరిత్ర ఆయనది. ఆయనే ప్రకాశం జిల్లా వైసీపీ సీనియర్ నేత జంకె వెంకటరెడ్డి.
స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి…
జంకె వెంకటరెడ్డి 1994లో స్వతంత్ర అభ్యర్థిగా మార్కాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో వైసీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా జగన్ వెంటే నిలిచారు. కానీ 2019 ఎన్నికల్లో జంకె వెంకటరెడ్డికి వైసీపీ అధిష్టానం టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి కుమారుడు నాగార్జున రెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. అయినా జంకె వెంకటరెడ్డి పార్టీ మారలేదు. నాగార్జున రెడ్డి విజయం కోసం పనిచేశారు.
అరుదైన నేతగా….
జంకె వెంకటరెడ్డి కి సౌమ్ముడిగా పేరుంది. రాజకీయాల్లో అరుదైన నేతగా ప్రకాశం జిల్లాలో ఆయనకు గుర్తింపు ఉంది. నిరాడంబర జీవితాన్ని గడుపుతారు. తన వద్దకు వచ్చే వారిని ఎవరినీ కాదనకుండా పనులు చేసి పంపుతారు. అలాంటి జంకె వెంకటరెడ్డికి వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఎలాంటి పదవి దక్కలేదు. ఆయన చూపిన విధేయతకైనా జగన్ అవకాశం కల్పిస్తారని అందరూ భావించారు.
పదవి ఇవ్వకపోవడంతో….
కానీ ఇటీవల నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినా జంకె వెంకటరెడ్డికి మాత్రం ఎలాంటి పదవి దక్కలేదు. కేవలం రెడ్డి సామాజికవర్గం కావడం, మంచితనం, ఎక్కడికి వెళ్లడన్న ధీమా కారణంగానే జంకె వెంకటరెడ్డికి పదవి దక్కలేదంటున్నారు. దీంతో జంకె వెంకటరెడ్డి వర్గీయుల్లో అసంతృప్తి నెలకొంది. ఆయన సౌమ్యుడు కావచ్చు. ఆయనను అభిమానించే వేలాది మంది సౌమ్యులు కాదన్న విషయాన్ని వైసీపీ అధిష్టానం గుర్తుంచుకోవాలన్న కామెంట్స్ వినపడుతున్నాయి.