ఫైట్ మోడ్ లోకి జేసీ బ్రదర్స్.. ఎటాక్ అంటున్నారే?
జేసీ బ్రదర్స్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇన్నాళ్లూ కేసులకు భయపడి మౌనంగా ఉన్న జేసీ సోదరులు తమపై వరసగా కేసులు నమోదవుతుండటంతో ఫైట్ మోడ్ లోకి వచ్చేశారు. [more]
జేసీ బ్రదర్స్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇన్నాళ్లూ కేసులకు భయపడి మౌనంగా ఉన్న జేసీ సోదరులు తమపై వరసగా కేసులు నమోదవుతుండటంతో ఫైట్ మోడ్ లోకి వచ్చేశారు. [more]
జేసీ బ్రదర్స్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇన్నాళ్లూ కేసులకు భయపడి మౌనంగా ఉన్న జేసీ సోదరులు తమపై వరసగా కేసులు నమోదవుతుండటంతో ఫైట్ మోడ్ లోకి వచ్చేశారు. ఇప్పుడు తాడిపత్రిలో ఎప్పుడు ఏ ఘటన జరుగుతుందోనన్న టెస్షన్ సర్వత్రా నెలకొంది. తాడిపత్రి లో పోలీసులు నిత్యం పహారా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జేసీ సోదరులిద్దరూ బస్తీ మే సవాల్ అంటూ ముందుకు రావడంతో పొలిటికల్ హీట్ మళ్లీ పెరిగింది.
పదిహేను నెలల వరకూ….
దాదపు పదిహేను నెలలు జేసీ బ్రదర్స్ అండర్ గ్రౌండ్ కే వెళ్లిపోయారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత జేసీ బ్రదర్స్ బాగా డీలా పడ్డారు. తమకు పట్టున్న తాడిపత్రి ప్రాంతంలోనూ ఓటమి పాలు కావడాన్ని వారు చాలాకాలం జీర్ణించుకోలేకపోయారు. అయితే వైసీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని భయపడి ఒకరకంగా వారు సైలెంట్ మార్గాన్నే ఎంచుకున్నారు. టీడీపీ కార్యక్రమాలకు కూడా చాలా కాలం దూరంగా ఉన్నారు.
వరస కేసులతో…..
ఇక జేసీ ప్రభాకర్ రెడ్డిపై రవాణా శాఖ నిబంధలను ఉల్లంఘించారని కేసులు నమోదు కావడం, జైలుకు పంపడంతో కొంత జేసీ బ్రదర్స్ లో అలజడి చెలరేగింది. తమకు సంబంధం లేని కేసుల్లోనూ ఇరికిస్తున్నారని వారు ఆరోపించినా ఫలితం లేదు. దాదాపు 50 రోజులకు పైగానే జేసీ ప్రభాకర్ రెడ్డి జైలులో ఉండి వచ్చారు. తర్వాత కూడా ఆయనపై వరస కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదవుతుండటం వారిలో ఆందోళన కల్గిస్తుంది. రెండేళ్ల క్రితం జరిగిన ప్రబోదానంద ఆశ్రమం కేసులో ఇంతవరకూ ఛార్జి షీట్ కూడా నమోదు కాకపోవాడాన్ని జేసీ బ్రదర్స్ ప్రశ్నిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో….
అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి రావడంతో ఇక ఎటాక్ తప్పదని జేసీ బ్రదర్స్ భావించారు. తమను స్థానికసంస్థల ఎన్నికలకు దూరంగా ఉంచాలని ప్రభుత్వం కేసుల్లో ఇరికిస్తుందని వారు చెబుతున్నారు. కేసులకు భయపడేది లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని జేసీ బ్రదర్స్ సవాల్ విసురుతున్నారు. ఒకరోజు దీక్షకు కూడా దిగారు. దీంతో తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ మళ్లీ యాక్టివ్ కావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.