జేసీ బండ్లు బోరుకొచ్చినట్లేనా? అరెస్ట్ తప్పదా?
అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ అంటే హడల్. అధికారంలో ఉండగా వారు చేసే పెత్తనం అంతా ఇంతా కాదు. అన్నింటా దూరి తాము ఉన్నామంటూ బిల్డప్ ఇచ్చే [more]
అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ అంటే హడల్. అధికారంలో ఉండగా వారు చేసే పెత్తనం అంతా ఇంతా కాదు. అన్నింటా దూరి తాము ఉన్నామంటూ బిల్డప్ ఇచ్చే [more]
అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ అంటే హడల్. అధికారంలో ఉండగా వారు చేసే పెత్తనం అంతా ఇంతా కాదు. అన్నింటా దూరి తాము ఉన్నామంటూ బిల్డప్ ఇచ్చే వారు. గత ప్రభుత్వ హయాంలో సయితం సొంత పార్టీ నేతలను కూడా లెక్క చేయలేదు. జిల్లాలో తాము అనుకున్నది అనుకున్నట్లు జరగాలని జేసీ బ్రదర్స్ భావించారు. అందుకే ఇప్పుడు జేసీ బ్రదర్స్ కష్టాల్లో ఉన్నా పార్టీ నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదు.
పీకల్లోతు కష్టాల్లో…..
ప్రస్తుతం జేసీ బ్రదర్స్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయి ఉన్నారు. వారికి అనేక వ్యాపారాలున్నాయి. అవి దాదాపు మూతబడ్డాయి. ప్రధానంగా ట్రాన్స్ పోర్టు వ్యాపారాన్ని జేసీ బ్రదర్స్ దాదాపుగా మూసుకున్నట్లే. జేసీ బ్రదర్స్ కు చెందిన ట్రావెల్స్ వ్యాపారంలో అక్రమాలు జరిగాయని పోలీసులకు ఫిర్యాదు అందడంతో విచారణచేపట్టారు. లారీల విక్రయానికి సంబంధించి నకిలీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లు జారీ చేశారని అధికారుల విచారణలో తేలింది.
ఛాసిస్ లను మార్చేసి….
లారీల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ కూడా ఈ మేరకు ధృవీకరించింది. తాము 154 స్క్రాప్ వాహనాలను విక్రయించామే తప్ప వాటిని రోడ్డు మీద తిప్పేందుకు విక్రయించలేదని పేర్కొంది. వీటిలో 108 వాహనాలు రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీటిని తాడిపత్రిలో రిజిస్ట్రేషన్ చేసినట్లు తేల్చారు. వీటిలో నాలుగింటి ఛాసిస్ ను మార్చేసి జేసీ బ్రదర్స్ బస్సులుగా తిప్పుతున్నట్లు అధికారులు కనుగొన్నారు.
త్రిశూల్ గనులు కూడా…?
తాడిపత్రిలో రిజిస్ట్రర్ అయిన 80 వాహనాలు కడలప, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో తిరుగుతున్న వాహనాల రిజిస్ట్రేషన్ ను రద్దు చేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఒకటి జేసీ బ్రదర్స్ వద్ద ఉన్నట్లే అధికారులు గుర్తించారు. దీంతో పాటు జేసీ బ్రదర్స్ కు చెందిన త్రిశూల్ కంపెనీ గనుల భూముల లీజును కూడా ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. దీంతో జేసీ బ్రదర్స్ ను అరెస్ట్ చేయక తప్పదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. జేసీ బ్రదర్స్ ఒకవైపు సంధిప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా ఫలించడం లేదు. మొత్తం మీద జేసీ బ్రదర్స్ కు గడ్డుకాలమే నడుస్తుందని చెప్పక తప్పదు.