Jc brothers : వీరిని ఏం చేయలేక.. పార్టీలో ఉంచుకోలేక?
జేసీ బ్రదర్స్ తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారారు. వారి వ్యవహార శైలితో పార్టీ నేతలు విసిగిపోయారు. అధినాయకత్వం పట్టించుకోక పోవడంతో వీరి పిచ్చి చేష్టలు ఇంకెంత ముదురుతాయోనన్న [more]
జేసీ బ్రదర్స్ తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారారు. వారి వ్యవహార శైలితో పార్టీ నేతలు విసిగిపోయారు. అధినాయకత్వం పట్టించుకోక పోవడంతో వీరి పిచ్చి చేష్టలు ఇంకెంత ముదురుతాయోనన్న [more]
జేసీ బ్రదర్స్ తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారారు. వారి వ్యవహార శైలితో పార్టీ నేతలు విసిగిపోయారు. అధినాయకత్వం పట్టించుకోక పోవడంతో వీరి పిచ్చి చేష్టలు ఇంకెంత ముదురుతాయోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. జేసీ బ్రదర్స్ చేష్టలతో విసిగిపోయిన అనంతపురం జిల్లా నేతలు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. వారిని కంట్రోల్ చేయకుంటే తాము పదవులకు రాజీనామాలు చేస్తామని కూడా హెచ్చరించారు. అయినా జేసీ బ్రదర్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని హైకమాండ్ భావిస్తుంది.
పార్టీకి తలవంపులు….
జేసీ బ్రదర్స్ ఇద్దరూ పార్టీకి తలవంపులు తెస్తున్నారంటున్నారు. జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. జేసీ దివాకర్ రెడ్డి కేసీఆర్ ను కలిసి రాయల తెలంగాణ ప్రతిపాదనను తేవడం, తాము ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేస్తామని చెప్పడం పార్టీని ఇబ్బంది పెట్టేవేనంటున్నారు. రాయలసీమలో ఎలా ఉన్నా జేసీ వ్యాఖ్యలు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పార్టీని నష్టపర్చేలా ఉన్నాయి.
కంటిమీద కునుకులేకుండా….
ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. నియోజకవర్గాలను పర్యటిస్తూ నేతలను ఇరకాటంలోకి నెడుతున్నారు. ఇటీవల పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించిన జేసీ ప్రభాకర్ రెడ్డి తనను అడ్డుకుంటే రెండో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తానని హెచ్చరించారు. దీంతో పుట్టపర్తి టీడీపీ నేతలు హైకమాండ్ కు జేసీపై ఫిర్యాదు చేశాయి. దీనికి తోడు తమకు శత్రువులుగా భావిస్తున్న టీడీపీ నేతల నియోజకవర్గాలను జేసీ బ్రదర్స్ టార్గెట్ చేశారంటున్నారు.
ఒక సామాజికవర్గాన్ని…..
పరామర్శపేరుతో నియోజకవర్గాలకు వెళ్లి అక్కడ ఒక సామాజికవర్గం వారిని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందని టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ పై ఆరోపణలు చేస్తున్నారు. అనంతపురం టౌన్, పుట్టపర్తి, రాయదుర్గం, శింగనమల, పెనుకొండ, ధర్మవరం వీరు టార్గెట్ చేసినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతమున్న తరుణంలో జేసీ బ్రదర్స్ వంటి నేతలు పార్టీకి అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. వారిని వదులుకోలేక, ఉన్న నేతలకు నచ్చ చెప్పలేక చంద్రబాబు సతమతమవుతున్నారు.