జేసీ చెప్పిన దాంటో తప్పేముంది ?
జేసీ దివాకర్ రెడ్డి. కాంగ్రెస్ రాజకీయాల్లో ముదిరిన పెద్దాయన. రాయలసీమ బోళాతనం నిండా ఉన్న మనిషి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడం మాత్రమే వచ్చు. పర్యవసానాలు, రాజకీయ లెక్కలు [more]
జేసీ దివాకర్ రెడ్డి. కాంగ్రెస్ రాజకీయాల్లో ముదిరిన పెద్దాయన. రాయలసీమ బోళాతనం నిండా ఉన్న మనిషి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడం మాత్రమే వచ్చు. పర్యవసానాలు, రాజకీయ లెక్కలు [more]
జేసీ దివాకర్ రెడ్డి. కాంగ్రెస్ రాజకీయాల్లో ముదిరిన పెద్దాయన. రాయలసీమ బోళాతనం నిండా ఉన్న మనిషి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడం మాత్రమే వచ్చు. పర్యవసానాలు, రాజకీయ లెక్కలు అసలు చూసుకోరు. ఆయన రాజకీయం ప్రవేశించేనాటికి ఉన్న వాతావరణం వల్ల బహుశా అవి అబ్బి ఉంటాయి. కానీ నేటి కాలంలో అవి చెల్లవేమో. పైగా ఆయన ఉన్న పార్టీ టీడీపీ, అధినేత చంద్రబాబు తీరు చూస్తే గోప్యత ఎక్కువ. ఆయన రాజకీయం అంతా కూడా తెర వెనక సాగిపోయేదే. ఏ రోజూ మనసు విప్పి కనీసం సన్నిహిత నేతలతో కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. అటువంటి పార్టీలో ఉంటూ అధినేత మనసు తెలుసుకోకుండా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడం మాత్రమే జేసీ దివాకర్ రెడ్డి చేస్తున్న పొరపాటు. అంతే తప్ప ఆయన రాజకీయ విశ్లేషణ ఏ మాత్రం తప్పు కానే కాదు.
మ్యానిపులేటర్ గానే ….
చంద్రబాబుకు మ్యానిపులేటర్ గానే పేరు. ఆయన పరిస్థితులను అనువుగా మార్చుకుని మాత్రమే రాజకీయం చేయగలరు. అవి కలసి రాకపోతే డీలా పడతారు. ఇక చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎపుడూ ప్రజాకర్షణ కలిగిన నేతలతో ఎదురు నిలిచి పోరాడి గెలిచిన దాఖలాలు లేవు. ఆయన సొంత మామ ఎన్టీఆర్ కి అపరిమితమైన జనాకర్షణ ఉంది. నిజంగా ఎన్టీఆర్ 1996 తరువాత కూడా బతికి ఉంటే ఆయన పెట్టిన పార్టీయే జనంలో గెలిచి అసలైన తెలుగుదేశం అయ్యేది, చంద్రబాబు దారుణంగా ఓడిపోయే వారు. అది నిజమేనని బాబు మనసుకు కూడా తెలుసు. వయసు మీరి ఎన్టీయార్ అనారోగ్యంతో కళ్ళు మూయడమే బాబు పాలిట వరం అనుకోవాలి. ఆయన సుదీర్ఘ రాజకీయానికి అదే ఆశీర్వాదం అనుకోవాలి.
ఓడారుగా….?
ఇక చంద్రబాబు తరువాత కాలంలో మరో ఇద్దరు జనాకర్షణ నేతలతో తలపడి ఓడిపోయారు. వారే వైఎస్సార్, కేసీఆర్. ఈ ఇద్దరు నేతలూ కూడా జనం మనుషులుగా ముద్ర పడ్డారు. వైఎస్సార్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆయన ముందు చంద్రబాబు ఓడిపోవడం తప్ప ఏం చేయలేకపోయారు. ఇక వైఎస్సార్ తరువాత అయినా ఉమ్మడి ఏపీలో చంద్రబాబు గానీ ఆయన టీడీపీ కానీ కుదురుకుందా అంటే లేనేలేదు. కేసీఆర్ రూపంలో మరో జనాకర్షణ నేత ఎదురునిలిచారు. దాంతో చేసేదిలేక సగం ముక్కను అక్కడే వదిలేసుకునిక పదమూడు జిల్లాల ఏపీకి చంద్రబాబు రావాల్సివచ్చింది. ఇక ఆనాడు నెమ్మదిగా మొదలైన జగన్ మార్క్ రాజకీయం ఇపుడు చండప్రచండంగా ఏపీని కమ్ముకుంది. జగన్ బ్రహ్మాండమైన ప్రజాకర్షణతో వెలుగుతున్న నేతగా ఇపుడు అక్కడ ఉన్నారు.
తట్టుకేలేరుగా :
జగన్ ని తట్టుకోలేరు, మా పార్టీ వారు ఆయన్ని ఢీ కొట్టలేరు. ఇదే జేసీ దివాకరరెడ్డి చెప్పిన మాట. రాజకీయ విశ్లేషకుడిగా జేసీ చెప్పారు. ఆయన పార్టీ మనిషిగా మాట్లాడితే చంద్రబాబుకు భజన చేసేవారు. కానీ ఆయన జగన్ బలం గురించి అంచనా వేసి మరీ చెప్పారు. ఇంట్లో ఏసీ గదుల్లో కూర్చుని చేసే తమ్ముళ్ళు దీక్షలు జగన్ ని అసలు కదిలించలేవని కూడా చెప్పారు. జగన్ ని ఎదిరించాలంటే సగం రాష్ట్రమే కదిలిరావాలని జేసీ దివాకర్ రెడ్డి అన్న మాటలు టీడీపీ ఒక గుణపాఠంగా తీసుకోవాలి. అంటే సగం రాష్ట్రం బలం తన వైపు తిప్పుకుంటే కానీ టీడీపీకి జగన్ ని ఓడించడం కష్టమని జేసీ దివాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టే చేదు నిజం చెప్పారు.
వ్యూహాలే చాలవు ….?
బహుశా ఇది చంద్రబాబుకు జీర్ణం కాకపోవచ్చు. కానీ బాబు దీన్ని పరిగణనలోకి తీసుకునే రాజకీయం చేయాలి. మ్యానిపులేట్ చేసి మీడియా ద్వారా జగన్ ని చెడ్డ చేయవచ్చు. కానీ జగన్ జనం మనిషి. ఆయన బలం జనంలో ఉంది. ఆయన్ని ఢీ కొట్టడం సులువు కాదు, ఇదే మాట జేసీ చెబితే బాబు అండ్ కో కు గుస్సా రావడం నిజంగా రాజకీయ విషాదమే. చంద్రబాబు కి నాడూ నేడూ అతి పెద్ద మైనస్ జనాకర్షణ నేత కాకపోవడం, అందువల్ల జగన్ ని ఆయన ఢీ కొట్టడం అంటే వట్టి రాజకీయ వ్యూహాలే సరిపోవు. ఇది జేసీ దివాకర్ రెడ్డితో పాటు అంతా అంటున్న మాట.