జేసీ ఇప్పట్లో కోలుకోలేరా? ఎవరూ అండగా లేరా?
రాయలసీమలో సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఒంటరి వారయినట్లే కన్పిస్తుంది. వరస దెబ్బలు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాన్ని ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. అనంతపురం జిల్లా టీడీపీ [more]
రాయలసీమలో సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఒంటరి వారయినట్లే కన్పిస్తుంది. వరస దెబ్బలు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాన్ని ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. అనంతపురం జిల్లా టీడీపీ [more]
రాయలసీమలో సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఒంటరి వారయినట్లే కన్పిస్తుంది. వరస దెబ్బలు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాన్ని ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. అనంతపురం జిల్లా టీడీపీ నేతలు కూడా జేసీ దివాకర్ రెడ్డికి అండగా ఉండటం లేదు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. అధికారంలో ఉండగా జేసీ ఫ్యామిలీ అందరితో కయ్యాలు పెట్టుకోవడం, నియోజకవర్గాల్లో వేలు పెట్టడం వల్లనే ఇప్పుడు జేసీ కష్టాల్లో ఉన్నా ఆయనకు ఎవరూ మద్దతు తెలపలేకపోతున్నారు.
టీడీపీలో ఏ నేతకూ…?
గత పదిహేను నెలల నుంచి టీడీపీలో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి జరిగిన నష్టం ఎవరీకీ జరగలేదనే చెప్పాలి. వైసీపీ అధికారంలోకి రాగానే జేసీ కుటుంబానికి చెందిన దివాకర్ ట్రావెల్స్ మూతపడింది. వరసగా కేసులు నమోదు అవుతుండటంతో ఆయన ట్రావెల్స్ కంపెనీని మూసి వేసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వంలో అక్రమ కేసులు తట్టుకోలేకనే ట్రావెల్స్ ను మూసి వేసుకోవాల్సి వచ్చిందని జేసీ దివాకర్ రెడ్డి బహిరంగంగానే చెప్పారు.
ఇప్పటికే కేసులతో….
ఇక జేసీ ప్రభాకర్ రెడ్డిపై అనేక కేసులు నమోదయ్యాయి. దాదాపు యాభై రోజులకు పైగానే ఆయన జైలు జీవితం గడిపారు. చివరకు బెయిల్ తెచ్చుకుని బయటపడ్డారు. ఇక జేసీ ఫ్యామిలీకి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ కూడా మూత బడే స్థితికి చేరుకుంది. త్రిశూల్ కంపెనీకి వంద కోట్ల జరిమానాను మైనింగ్ శాఖ విధించింది. దీనిపై న్యాయపోరాటం చేయాలని జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ నిర్ణయించింది.
మూతబడిన కంపెనీలు….
అయితే జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి ఇంత నష్టం జరుగుతున్నా పార్టీ పరంగా స్థానిక నేతలు ఎవరూ అండగా నిలబడటం లేదు. చంద్రబాబు, లోకేష్ లు తప్పించి ఎవరూ జేసీ ఫ్యామిలీకి మద్దతుగా నిలబడటం లేదు. అనంతపురం జిల్లా నేతలు జేసీ దివాకర్ రెడ్డిని ఇప్పటికీ తమకు శత్రువుగానే చూస్తున్నారు. అందుకే ఆయనకు మద్దతుగా నిలబడటం లేదని టీడీపీ అనంతపురం నేతలు బాహాటంగానే చెబుతున్నారు. మొత్తం మీద టీడీపీలో ఆర్థికంగా నష్టపోయిన ఏకైక నేత జేసీ దివాకర్ రెడ్డి మాత్రమేనని చెప్పుకోవాలి.