తాడిపత్రిలో జేసీ వ్యూహం ఈసారి ఫలిస్తుందా?
2024 ఎన్నికల్లో తాడిపత్రిలో ఎలాగైనా గెలవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. క్యాడర్ డీలా పడకుండా ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ [more]
2024 ఎన్నికల్లో తాడిపత్రిలో ఎలాగైనా గెలవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. క్యాడర్ డీలా పడకుండా ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ [more]
2024 ఎన్నికల్లో తాడిపత్రిలో ఎలాగైనా గెలవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. క్యాడర్ డీలా పడకుండా ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ వారిని ఉత్తేజ పరుస్తున్నారు. మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికైన జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తిరిగి తన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిని బరిలోకి దింపి విజయం సాధించాలని భావిస్తున్నారు. అందుకోసమే ఇప్పటి నుంచే ఆయన అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు.
ఓటమి నుంచి బయటపడి…
నిజానికి తాడిపత్రి జేసీ బ్రదర్స్ చేతుల్లోనుంచి పోతుందని ఎవరూ ఊహించలేదు. పెద్దారెడ్డి గెలుపు వారికి రాజకీయంగా ఇబ్బందే. అప్పట్లో జేసీ అస్మిత్ రెడ్డికి, పెద్దారెడ్డి మధ్య పోలిక చూసి ప్రజలు పెద్దారెడ్డి వైపు మొగ్గు చూపారు. యువకుడైన అస్మిత్ రెడ్డి కంటే పెద్దారెడ్డి బెటర్ అని భావించారు. అందుకే 2019 ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. రెండేళ్ల ముందే తిరిగి తాడిపత్రి మున్సిపాలిటీని కైవసం చేసుకుని తమ పట్టు జారిపోలేదని నిరూపించుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో….
అయితే వచ్చే ఎన్నికల్లోనూ జేసీ అస్మిత్ రెడ్డిని బరిలోకి దించాలన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి ఆలోచన. వేరే పార్టీ వైపు కూడా తాము చూడబోమంటున్నారు. తెలుగుదేశం పార్టీలోనే ఉండి తాడిపత్రిని కైవసం చేసుకొని తొడగొట్టాలన్నది జేసీ బ్రదర్స్ శపథకం చేసుకున్నట్లుంది. అందుకే అస్మిత్ రెడ్డిని హైలెట్ చేస్తూ నియోజకవర్గంలో పర్యటనలను ఇప్పటి నుంచే ప్రారంభించారు. తాడిపత్రిలో తమకు ఏ మాత్రం పట్టు తగ్గలేదని నిరూపించుకోదలచుకున్నారు.
అంతా తమకు అనుకూలంగానే?
పెద్దారెడ్డి వ్యవహారం తమకు అనుకూలంగా మారుతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి భావిస్తున్నారు. తన ఇంటి మీద నేరుగా దాడికి రావడం, తమ కుటుంబంపై అన్ని రకాలుగా దెబ్బతీయడం వంటి అంశాలు వచ్చే ఎన్నికల్లో తమకు అనుకూలిస్తాయని జేసీ ప్రభాకర్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో తమ గ్రిప్ ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరి అస్మిత్ రెడ్డిని టీడీపీ ఎమ్మెల్యేగా చూడాలన్న జేసీ ప్రభాకర్ రెడ్డి కోరిక నెరవేరుతుందా? లేదా? అన్నద చూడాలి.