ఊహించిందే.. కానీ ఇంత ఫాస్ట్ గానా?
జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ ఊహించిందే. ఆయనపై ఇటీవల కేసులు నమోదయ్యాయి. అయితే అరెస్ట్ అవుతారని జేసీ కుటుంబానికి కూడా తెలుసు. అందుకే తాను విచారణకు హాజరవుతానని [more]
జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ ఊహించిందే. ఆయనపై ఇటీవల కేసులు నమోదయ్యాయి. అయితే అరెస్ట్ అవుతారని జేసీ కుటుంబానికి కూడా తెలుసు. అందుకే తాను విచారణకు హాజరవుతానని [more]
జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ ఊహించిందే. ఆయనపై ఇటీవల కేసులు నమోదయ్యాయి. అయితే అరెస్ట్ అవుతారని జేసీ కుటుంబానికి కూడా తెలుసు. అందుకే తాను విచారణకు హాజరవుతానని జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం పంపుతున్నా పట్టించుకోవడం లేదు. ఏడాది నుంచి తొలుత జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ పై అనంతపురం జిల్లాలో ప్రచారం జరుగుతంది. అయితే నిన్ననే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడంతో జేసీ సోదరుల అరెస్ట్ ఇప్పుడప్పడే ఉండదనుకున్నారు.
నకిలీ పత్రాలు సృష్టించి….
154 బస్సులను కు నకిలీ ఎన్ఓసి లతో పాటుగా నకిలీ ఇన్సూరెన్సు సృష్టించారన్న ఆరోపణలపై అనంతపురం ఆర్టీఏ అధికారులు విచారణ చేశారు. ఇందులో జేసీ ప్రభాకర్ రెడ్డిని నిందితులుగా చేర్చారు. అయితే తమపై ఫిర్యాదు చేసిన వారితో జేసీ ప్రభాకర్ రెడ్డి రాజీకి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ రాజీ కుదరడం లేదు. దీనికి కూడా జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కారణమని జేసీ వర్గం ఆరోపణలు చేస్తుంది.
ఏడాది కాలంగా….
గత ఏడాది కాలంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మౌనంగానే ఉంటున్నారు. రాజకీయంగా పెద్దగా పట్టించుకోవడం లేదు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కు పోటీ చేయడంతో మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి రాజీకీయంగా మళ్లీ యాక్టివ్ అయ్యారంటున్నారు. అప్పటి నుంచే జేసీ ప్రభాకర్ రెడ్డి మెడకు రవాణాశాఖ ఉచ్చు బిగిసిందంటున్నారు. అంతేకాకుండా ఆశ్రమం పై దాడి కేసులోనూ జేసీ బ్రదర్స్ పై కేసులుంటున్నారు.
రాజకీయ కక్ష అంటున్న…..
దీనిపై జేసీ కుటుంబం భగ్గుమంటోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అన్యాయమని జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిని దారుణంగా అరెస్ట్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని జేసీ కుటుంబం ఆరోపిస్తుంది. తమకు వాహనాలను విక్రయించిన అశోక్ లేలాండ్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమపై టార్గెట్ చేయడమేంటని జేసీ కుటుంబం ప్రశ్నిస్తుంది. మొత్తం మీద నిన్న అచ్చెన్నాయుడు, నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ లతో తెలుగుదేశం పార్టీ నేతలకు టెన్షన్ పట్టుకుంది.