జేడీ వారితో టచ్ లో ఉన్నారా?
మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన జనసేన నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నారు. ఎటువంటి రాజకీయ కార్యక్రమాల్లో [more]
మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన జనసేన నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నారు. ఎటువంటి రాజకీయ కార్యక్రమాల్లో [more]
మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన జనసేన నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నారు. ఎటువంటి రాజకీయ కార్యక్రమాల్లో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొనడం లేదు. గత నెలలుగా ఆయన ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు అంటున్నారు. ఆయనకు విశాఖ బాగా నచ్చిందంటున్నారు. అందుకే విశాఖ నుంచే రాజకీయాలు కొనసాగించాలని జేడీ లక్ష్మీనారాయణ భావిస్తున్నారు.
విశాఖ నుంచే…
అయితే తాను ఒంటరిగా పోటీ చేస్తే విశాఖ వంటి చోట గెలుపు సాధ్యం కాదు. గత ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసినా అత్యధిక ఓట్లను సాధించారు. లోపాయికారీగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ సహకరించినందునే ఆయనకు అన్ని ఓట్లు వచ్చాయన్నది అందరికీ తెలిసిందే. ఈసారి ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. జేడీ లక్ష్మీనారాయణ రాకను బీజేపీ నేతలు కూడా స్వాగతిస్తున్నట్లు సమాచారం.
బీజేపీ కూడా…..
బీసీ ఓట్లను కొంత తమ వైపు తిప్పుకోవాలంటే జేడీ లక్ష్మీనారాయణ వంటి నేతలు అవసరమని భావిస్తున్నారు. నిజానికి జేడీ లక్ష్మీనారాయణ తొలినాళ్లలోనే బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఆయన అనూహ్యంగా అప్పట్లో జనసేనే వైపు మొగ్గుచూపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పాలిటిక్స్ పట్ల సీరియస్ నెస్ లేకపోవడంతో ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. విశాఖ బీజేపీ కి అనుకూలమని గత ఎన్నికల ఫలితాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
త్వరలోనే ముహూర్తం….
అందుకే జేడీ లక్ష్మీనారాయణ బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. బీహార్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల సమక్షంలో చేరతారని తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా జేడీ లక్ష్మీనారాయణ తో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద జేడీ లక్ష్మీనారాయణ విశాఖ పట్నం నుంచే పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవ్వాలని భావిస్తున్నారు. అందుకు బీజేపీయే సరైన పార్టీ అని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.