మరో ఛాన్స్ లేదా?
కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో అధికార పార్టీ పట్టు ఎలా ఉంది? ఇక్కడ నుంచి గెలిచిన జోగి రమేష్ హవా ఏ రేంజ్లో కొనసాగుతోంది? గత ఎన్నికల్లో పోటీకి [more]
కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో అధికార పార్టీ పట్టు ఎలా ఉంది? ఇక్కడ నుంచి గెలిచిన జోగి రమేష్ హవా ఏ రేంజ్లో కొనసాగుతోంది? గత ఎన్నికల్లో పోటీకి [more]
కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో అధికార పార్టీ పట్టు ఎలా ఉంది? ఇక్కడ నుంచి గెలిచిన జోగి రమేష్ హవా ఏ రేంజ్లో కొనసాగుతోంది? గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జోగి రమేష్ ఐదు మాసాల కిందట జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో ఆయన హవా ఇప్పుడు ఎలా ఉందనే చర్చ సాగుతోంది. 2009లో కాం గ్రెస్ తరఫున ఒకసారి ఇక్కడ నుంచి పోటీ చేసిన జోగి.. కేవలం 1200 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు . ఇటీవల జరిగిన ఎన్నికల్లో త్రిముఖ పోటీ (టీడీపీ, వైసీపీ, జనసేన) ఉన్నప్పటికీ.. 7839 ఓట్ల ఆధిక్యత సాధించారు.
ఒకే పార్టీ ఎప్పుడూ….
అయితే, పెడనలో ఎప్పుడూ ఒకే పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి లేదు. గడిచిన మూడు ఎన్నికలను గమనిస్తే.. ప్రజలు భిన్నమైన తీర్పు ఇచ్చారు. 2009లో కాంగ్రెస్‌ను గెలిపించిన ఇక్కడి ప్రజలు 2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన కాగిత వెంకట్రావుకు భారీ ఆధిక్యతతో పట్టం కట్టారు. ఇక, ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీని గెలిపించారు. దీంతో ఏదో ఒక పార్టీ ఇక్కడ ఆధిపత్యం సాధించిన పరిస్తితి కనిపించదు. అయితే, ఇప్పటికైనా జోగి రమేష్ ముందు మంచి ఫ్యూచర్ ఉంది. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా ఆయన ఇక్కడ పట్టు సాధించే పరిస్థితి కూడా ఉంది.
గతంలో ఉన్న దూకుడు….
అయితే, ఇప్పటి వరకు జోగి రమేష్ పెద్దగా నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదు. జోగి రమేష్ ఈ నియోజకవర్గానికి నాన్‌లోకల్ అవుతారు. మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నంకు చెందిన జోగి రమేష్ కి వైఎస్ సిఫార్సుతో 2009లో అనూహ్యంగా పెడన సీటు దక్కగా జోగి రమేష్ టీడీపీ సీనియర్ కాగిత వెంకట్రావుపై విజయం సాధించారు. ఇక ఇప్పుడు ఆయన రెండోసారి పెడన నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా గతంలో అంత దూకుడు చూపించడం లేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి కూడా తీసుకు వెళ్లిన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు.
కాగిత నైరాశ్యంలో…..
అదే సమయంలో ఎన్నికల్లో ఓటమి పాలైన కాగిత వెంకట్రావు వారసుడు కాగిత కృష్ణప్రసాద్ కూడా ప్రజల్లో ఉండడం లేదు. నిజానికి చంద్రబాబు హయాంలో ఇక్కడ అభివృద్ది చేసి చూపించారు. అయినా కూడా ప్రజలు జగన్ సునామీలో వైసీపీని గెలిపించారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన కాగిత ఫ్యామిలీ ఇక్కడ యాక్టివ్‌గా ఉండడం లేదు. సీనియర్ అయిన కాగిత ఈ ఎన్నికలకు ముందే రాజకీయాలకు దూరమై.. తన వారసుడిని రంగంలోకి దించారు. ఇక తొలి ప్రయత్నంలోనే కాగిత కృష్ణప్రసాద్ ఓడిపోవడంతో కాగిత వర్గంలో నిర్లిప్తత నెలకొంది. అయితే దీనిని యూజ్ చేసుకుని మరింత దూకుడుగా ముందుకు వెళ్లాల్సిన జోగి రమేష్ సైతం సోసోగానే ఉంటున్నారు.