పెడనలో జోగిమార్కు బెదిరింపు పాలిటిక్స్…!
కృష్ణా జిల్లా పెడన రాజకీయాల్లో బెదిరింపుల పర్వం సాగుతోందా ? అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు జోగి రమేష్.. ప్రతిపక్ష నేతలను బెదిరింపులకు [more]
కృష్ణా జిల్లా పెడన రాజకీయాల్లో బెదిరింపుల పర్వం సాగుతోందా ? అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు జోగి రమేష్.. ప్రతిపక్ష నేతలను బెదిరింపులకు [more]
కృష్ణా జిల్లా పెడన రాజకీయాల్లో బెదిరింపుల పర్వం సాగుతోందా ? అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు జోగి రమేష్.. ప్రతిపక్ష నేతలను బెదిరింపులకు గురి చేస్తున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు స్థానిక రాజకీయ పరిశీలకులు. పెడన నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్‌లు ఢీ అంటే ఢీ అనే రేంజ్లో రాజకీయాలు చేశాయి. ఈ క్రమంలోనే 2009లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై జోగి విజయం సాధించారు. అయితే, తర్వాత ఆయన వైసీపీలోకి చేరిపోయారు. గత ఎన్నికల్లో పెడన నుంచి మరోసారి విజయం సాధించారు. వాస్తవంగా చూస్తే మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నంకు చెందిన జోగి రమేష్ పెడనకు నాన్‌లోకల్. అయితే ఇక్కడ రెండు సార్లు గెలిచినా ఆయన పట్టుకోసం కిందా మీదా పడుతూనే ఉన్నారు.
బలమైన నేతలు ఉండటంతో….
ఇక ఇక్కడ టీడీపీకి కూడా బలమైన నాయకులు ఉన్నారు. కాగిత వెంకట్రావు వంటి నేతలు ఇక్కడ నుంచి వరుస విజయాలు విజయం సాధించారు. కాగిత బలమైన పునాది వల్లే పెడన మునిసిపాలిటీలో టీడీపీ బలంగా ఉంది. 2005లో వైఎస్ హవా బలంగా ఉన్నప్పుడే జిల్లాలో కాంగ్రెస్ తిరుగులేని విధంగా మున్సిపాల్టీల్లో ఘనవిజయం సాధించినా పెడనలో మాత్రం టీడీపీ గెలిచింది. ఇక టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ పెడన మున్సిపాల్టీపై ఆ పార్టీ జెండాయే ఎగిరింది. పెడన మునిసిపాలిటీలో టీడీపీ బలంగా ఉన్న నేపథ్యం సహా.. బందరు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ వర్గంతో పాటు.. ఇక్కడ కాగిత కుమారుడు కృష్ణప్రసాద్ వర్గం బలంగా ఉండడంతో ఇక్కడ మునిసిపల్ ఎన్నికల్లో గెలుపుపై జోగి రమేష్ కి కాస్త టెన్షన్ టెన్షన్‌గానే ఉందట.
స్థానిక సంస్థల ప్రాతిపదికనే…..
అసలే జోగి రమేష్ బీసీ ( గౌడ) కోటాలో మరో యేడాదిలో జరిగే మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు జగన్ పార్టీ నేతలు అందరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన చోట్ల ఎమ్మెల్యేలకు ప్రయార్టీ ఇవ్వనని వార్నింగ్ ఇచ్చేశారు. పైగా జోగి రమేష్ కేబినెట్ రేసులో కూడా ఉన్నాడు. దీంతో పెడన మునిసిపాల్టీ రిజల్ట్ తేడా కొడితే జోగి రమేష్ ఆశలు అడియాసలే అవుతాయి. ఈ క్రమంలోనే ఆయన ఎలాగైనా పెడన మునిసిపాల్టీపై వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు చివరకు బెదిరింపు రాజకీయాలకు కూడా దిగినట్టు తెలుస్తోంది. వాస్తవంగా కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడి ఉండకపోతే పెడనలో వైసీపీ గెలుపు అంత సులువు కాదన్న టాక్ ఉంది.
వార్నింగ్ లతో పార్టీలోకి….
గత ఏడాది ఎన్నికల్లో జోగి రమేష్ కి కేవలం ఐదువేల మెజారిటీతోనే ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. దీంతో ఇక్కడ గెలుపుకోసం జోగి రమేష్ బలవంతంగా అయినా టీడీపీ నేతలను తమ వైపునకు తిప్పేసుకుంటున్నారట. దారికి వచ్చే నేతలకు ప్రలోభాలు, పదవులు.. దారికి రాని నేతలను బెదిరించి మరీ పార్టీలోకి తీసుకుంటున్నారట. ఇప్పుడు ఈ ప్రచారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక కొందరు టీడీపీ కీలక నేతల ఇళ్లకు వెళ్లి మరీ వారిని లొంగతీసుకుంటున్నారని అంటున్నారు. వైసీపీ గెలవదని భావిస్తున్న జోగి రమేష్ తన మార్కు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని స్థానిక నేతలు అంటున్నారు. మొత్తంగా జోగి మార్క్ వార్నింగ్ రాజకీయాలు పెడన మున్సిపాల్టీపై వైసీపీ జెండా ఎగుర వేయిస్తాయో ? లేదో ? చూడాలి.