ఈ జీవో ఏంటి జగనూ..?
ఎవరు ఎవరిని ఏమి అడగకుండా ఏపీ సర్కారు ఓ జీవో జారీ చేసింది. మీడియా అక్రెడిషన్ కోసం జారీ చేసిన జీవో 142ను సమాచార శాఖ కమిషనర్, [more]
ఎవరు ఎవరిని ఏమి అడగకుండా ఏపీ సర్కారు ఓ జీవో జారీ చేసింది. మీడియా అక్రెడిషన్ కోసం జారీ చేసిన జీవో 142ను సమాచార శాఖ కమిషనర్, [more]
ఎవరు ఎవరిని ఏమి అడగకుండా ఏపీ సర్కారు ఓ జీవో జారీ చేసింది. మీడియా అక్రెడిషన్ కోసం జారీ చేసిన జీవో 142ను సమాచార శాఖ కమిషనర్, నల్లగొండ జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి తమ్మా విజయ్ కుమార్ రెడ్డి బుధవారం జారీ చేశారు. జీవో ఆసాంతం పరిశీలిస్తే, అక్రిడేషన్ వ్యవస్థ ప్రక్షాళన కంటే లోపాలే మెండుగా కనిపిస్తాయి. ఇప్పటికే జర్నలిస్ట్ గుర్తింపు కోసమే పుట్ట గొడుగుల్లా మీడియా సంస్థలు పుట్టుకొస్తున్న వేళ వాటికి అడ్డుకట్ట వేయడం కంటే కొంత దాట వేత ధోరణి, కొంత ఉదారత, మరికొంత స్వామి భక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
అక్రిడేషన్ కోసం….
అక్రిడేషన్ మంజూరు కోసం రకరకాల కొర్రీలు, ఆంక్షలు వేసిన సమాచార శాఖ యాజమాన్యాల విషయంలో మాత్రం ఉదారంగా వ్యవహరించినట్లు కనిపించింది. ఉద్యోగ భద్రత, కార్మిక చట్టాలు ఏ మాత్రం వర్తించని అసంఘటిత రంగం కోసం కనీస ధర్మం కూడా పాటించక పోవడం వెనుక మర్మం ఇట్టే తెలుసుకోవచ్చు. జర్నలిస్ట్, ప్రెస్ ముసుగులో జనం చలామణి అవుతున్న సమయంలో యాజమాన్యాల నుంచి వాటికి అడ్డుకట్ట ప్రయత్నం ఒక్కటి కూడా తాజా జీవోలో లేదు.
సంక్షేమాన్ని మరచి…..
జర్నలిస్ట్ పీఎఫ్, ఈఎస్ఐ వంటి వివరాలు తప్పని సరి చేసి ఉంటే వారికి ఎక్కువ మేలు జరిగి ఉండేది. ఇలాంటి నిబంధన పెడితే ప్రభుత్వ వ్యతిరేక మాధ్యమలతో పాటు అధికార మీడియా కూడా ఇరకాటంలో పడేది. స్వామి భక్తి చాటుకుంటున్న జర్నలిస్ట్ పెద్దల చిత్తశుద్ధి కూడా తేటతెల్లం అయ్యేది. జీవో 142 మొత్తం పాత నిబంధనల మార్పు, యాజమాన్యాలు ఎలా ఇరకాటంలో పడతాయో ఆలోచించారు తప్ప జర్నలిస్టుల సంక్షేమం పూర్తిగా విస్మరించారు. సెంటి మీటర్ల లెక్క కొలత వేసి, ప్రకటనలు టార్గెట్ పెట్టి, ప్రభుత్వ రాయితీలు వచ్చే అక్రిడేషన్ తాయిలంగా మారిన పరిస్థితి మార్చడం మీద దృష్టి పెట్టడం విస్మరించారు. ఇలాంటి ఉత్తర్వు మీద జర్నలిస్ట్ సంఘాలు, సలహాదారులు కూడా పెద్దగా అభ్యంతర పెట్టక పోవచ్చు.