అగ్రిమెంట్ కుదిరిందా?
చంద్రబాబునాయుడు రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. రాజకీయ గండర గండడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తలచుకుంటే ఏదైనా సఫలం కావాల్సిందే. అంతటి అపర చాణక్యుడు ఇపుడు మాత్రం [more]
చంద్రబాబునాయుడు రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. రాజకీయ గండర గండడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తలచుకుంటే ఏదైనా సఫలం కావాల్సిందే. అంతటి అపర చాణక్యుడు ఇపుడు మాత్రం [more]
చంద్రబాబునాయుడు రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. రాజకీయ గండర గండడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తలచుకుంటే ఏదైనా సఫలం కావాల్సిందే. అంతటి అపర చాణక్యుడు ఇపుడు మాత్రం బాగా వెనక్కితగ్గిపోతున్నారు. మరీ ముఖ్యంగా గత రెండేళ్ళుగా టీడీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఇక ఎన్నికల్లో 23 సీట్లు రావడంతో టీడీపీకి చరమాంకం వచ్చిందని తమ్ముళ్ళే కలవరపడే పరిస్థితి. చంద్రబాబు తన లేటు వయసుని పక్కనపెట్టి శక్తికి మించి పనిచేస్తున్నారు. అయినా పార్టీలో ఎక్కడా జోష్ కనిపించడంలేదు. దాంతో ఏం చేయాలో పెద్దాయనకు సైతం అర్ధం కాని పరిస్థితిలో పసుపు రాజకీయం ఉంది.
చాప చుట్టేసినట్లే…
ఇపుడున్నట్లుగా టీడీపీ ఉంటే మాత్రం చాలా తొందరలోనే చాప చుట్టేసినట్లేనని పార్టీలో మధనం మొదలైంది. మరో వైపు యువ ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబుని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. అవినీతి కధలను ఒక్కొక్కటిగా వెలికి తీసే పని ప్రారంభించారు. బాబు కోటరీలో ముఖ్య నేతలపైన బిగిస్తున్న దర్యాప్తుల ఉచ్చుతో చంద్రబాబు సైతం నైతికంగా దెబ్బ తింటున్నారు. తాజాగా అచ్చెన్నాయుడు మీద ఈఎస్ఐ కుంభకోణం బయటపడడం ఓ విధంగా పసుపు శిబిరాన్ని కుదిపేసింది. మరెంతమంది ఇలా చిక్కుకుంటారో అన్న కలవరం అంతటా అవరించింది.
జూనియర్ వైపు….
ఈ నేపధ్యంలో చంద్రబాబు రాజకీయంగా సాహసమైన నిర్ణయానికి వస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు ఇంతవరకూ తమ కుమారుడు లోకేష్ గురించే ఆలోచన చేసి మరీ పార్టీని పడకేయించారన్న విమర్శలు సొంత పార్టీలోనే ఉన్నాయి. దానితో మధనపడిన పెద్దాయన ఇక లోకేష్ తో లాభం లేదని తానూ గ్రహించినట్లున్నారు. అందుకే సినిమా హీరోగా టాప్ రేంజిలో ఉన్న జూనియర్ ఎన్టీయార్ ని ఆశ్రయించాలన్న కచ్చితమైన నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. జూనియర్ కి ఏపీ టీడీపీ పగ్గాలు అప్పగించడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం దక్కుతుందని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారని ఒక ప్రచారమైంతే పసుపు పార్టీలో జోరుగా సాగుతోంది.
ఓకే అంటారా?
ఇపుడు చంద్రబాబు జూనియర్ మీద బాగా మెత్తబడ్డారని అంటున్నారు. ఆయనకు టీడీపీలో పెద్ద పీట వేసేందుకు రెడీ అవుతున్నారు. వీలైతే ఈ రోజుకు ఈ రోజే జూనియర్ కి పట్టాభిషేకం చేయడానికి చంద్రబాబు సిధ్ధం. మరి జూనియర్ దానికి ఒప్పుకుంటారా అన్నదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే జూనియర్ కి చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఇంకా అక్కడ బోలెడంత భవిష్యత్తు ఉంది. దాంతో ఆయన అన్నీ వదులుకు ఒక పార్టీగా టీడీపీకి కట్టుబడతారా. భవిష్యత్తు ఎలా ఉంటుందో లేదో తెలియని పాలిటిక్స్ ని పట్టుకుని బంగారు లాంటి భవిష్యత్తుని సినిమాల్లో వదిలేసుకుంటారా అన్నది కూడా చర్చగా ఉంది. చంద్రబాబు అయితే జూనియర్ కి పార్టీ పగ్గాలు అప్పగించి వీలైతే లోకల్ బాడీ ఎన్నికల నుంచే ఆయన సేవలను పూర్తిగా పొందాలని చూస్తున్నారుట. మరి జూనియర్ ఉలుకేంటో, పలుకేంటో చూడాలి.