జూపల్లికి రెడీ చేశారటగా
జూపల్లి కృష్ణారావు… తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవినే త్యజించి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అయితే ఇప్పుడు ఆయనకు పార్టీలో చుక్కలు కన్పిస్తున్నాయి. అసలు పార్టీలో [more]
జూపల్లి కృష్ణారావు… తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవినే త్యజించి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అయితే ఇప్పుడు ఆయనకు పార్టీలో చుక్కలు కన్పిస్తున్నాయి. అసలు పార్టీలో [more]
జూపల్లి కృష్ణారావు… తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవినే త్యజించి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అయితే ఇప్పుడు ఆయనకు పార్టీలో చుక్కలు కన్పిస్తున్నాయి. అసలు పార్టీలో ఉండాలా? వద్దా? అన్నది నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవాలనే ప్రయత్నంలో జూపల్లి కృష్ణారావు పార్టీ అధినాయకత్వం ఆగ్రహానికి గురయ్యారు. దీంతో పార్టీ జూపల్లిని పక్కన పెట్టినట్లే కన్పిస్తుంది. రేపో మాపో క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశమూ లేకపోలేదు.
మంత్రిగా జిల్లాను…..
జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి కీలకంగా వ్యవహరించారు 2014 ఎన్నికల్లో గెలిచిన జూపల్లి కృష్ణారావు మంత్రి కూడా పనిచేశారు. మంత్రిగా కేవలం తన నియోజకవర్గంలోనే కాకుండా మహబూబ్ నగర్ జిల్లా మొత్తాన్ని శాసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయన్న కారణంగా జూపల్లి కృష్ణారావుకు అప్పట్లో నేతల నుంచి అధికారుల వరకూ సలాములు చేసేవారు.
ఓటమి పాలవ్వడంతో….
అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన హర్షవర్థన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. హర్షవర్ధన్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి తీసుకురావడం వెనక మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నారు. గతంలో నిరంజన్ రెడ్డికి, జూపల్లి కృష్ణారావుకు పడేది కాదు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఈ నేపథ్యంలో హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావును పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఆహ్వానం పంపడం లేదు.
చర్యలు తీసుకునేందుకు…..
దీంతో జూపల్లి కృష్ణారావు తన సత్తా చాటుకోవాలనుకున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబెల్స్ ను రంగంలోకి దింపారు. ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరుపున పోటీ చేయించారు. నిజంగానే జూపల్లి కృష్ణారావు తన శక్తి ఏంటో చూపారు. రెబెల్స్ ను పోటీ నుంచి విరమించుకోవాలని కేటీఆర్ స్వయంగా సూచించినా వినలేదు. దాదాపు పది మంది అభ్యర్థులను గెలిపించుకుని వచ్చి టీఆర్ఎస్ కు మద్దతిస్తామని జూపల్లి కృష్ణారావు కేటీఆర్ తో చెప్పినా ఆయన నో చెప్పారు. తమకు మద్దతు అవసరం లేదని, రెబెల్స్ ను పార్టీలోకి తీసుకునేది లేదని తెగేసి కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం జూపల్లి కృష్ణారావుపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయంటున్నారు. మరి జూపల్లి ఇక కాంగ్రెస్ లోకి రాక తప్పదా? అన్న టాక్ విన్పిస్తుంది.