జగన్ ఫార్ములాతో ముందుకు పోతున్న కేసీఆర్ ..?
ఆంధ్రప్రదేశ్ లో కులాల కుమ్ములాటలు ఉన్నాయి. తెలంగాణ లో ఈ కులాల గోల లేదు. ఈ మాటలు చాలాసార్లు చెబుతూ వచ్చేవారు గులాబీ బాస్ కేసీఆర్. కమ్మా, [more]
ఆంధ్రప్రదేశ్ లో కులాల కుమ్ములాటలు ఉన్నాయి. తెలంగాణ లో ఈ కులాల గోల లేదు. ఈ మాటలు చాలాసార్లు చెబుతూ వచ్చేవారు గులాబీ బాస్ కేసీఆర్. కమ్మా, [more]
ఆంధ్రప్రదేశ్ లో కులాల కుమ్ములాటలు ఉన్నాయి. తెలంగాణ లో ఈ కులాల గోల లేదు. ఈ మాటలు చాలాసార్లు చెబుతూ వచ్చేవారు గులాబీ బాస్ కేసీఆర్. కమ్మా, రెడ్డి కులాల నడుమ అధికారం కోసం జరిగే పోరాటం, మిగిలిన కులాలు సామాజిక నిష్పత్తి ప్రకారం రాజకీయ అధికారం కోసం సాగించే యుద్ధం ఆంధ్రప్రదేశ్ లో వాస్తవ విషయమే. ఇక ప్రతీ అంశం లో రాజకీయం దాని వెనుక కుల ప్రాధాన్యత ఏపీ లో సంప్రదాయంగా వస్తున్నట్లే కనిపిస్తాయి. అందుకే నిన్న మొన్నటివరకు కులాల సమతూకంపై తెలంగాణ లో కేసీఆర్ పెద్దగా ప్రాధాన్యత ఇచ్చింది లేదు.
మారిన వైఖరి …
తెలంగాణ లో జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ చాలా పాఠాలు నేర్చుకున్నట్లే కనిపిస్తుంది. దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని ఆయన పీఠం ఎక్కి కుర్చున్నారన్నది ప్రతీ ఎన్నికల్లో టీఆరెస్ బాస్ పై విపక్షాల నుంచి వచ్చే తీవ్ర విమర్శ. దీనికి సరైన సమాధానం తెలంగాణ రాష్ట్ర సమితి దగ్గర లేదు. గత పాలకవర్గంలో కేబినెట్ లో మహిళలకు సరైన ప్రాధాన్యతే కేసీఆర్ కల్పించలేదు.ఆ తరువాత ఆయన వైఖరిలో మార్పు వచ్చి కొంత శాతం వారికి అవకాశం కల్పించారు. ఎపి రాజకీయాలు కులం, మతం, ప్రాంతంతో ముడిపడి ఉంటాయని చెప్పే ఆయన హుజురాబాద్ ఎన్నికల్లో వివిధ కులాల ఓట్లను ఆకర్షించి గట్టెక్కాలని వ్యూహం రూపొందించినట్లు స్పష్టం అవుతుంది.
ఒక్కో కులాన్ని టార్గెట్ చేస్తూ …
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఉన్న ఎల్ రమణ ను కేసీఆర్ తమ పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పేశారు. నిజానికి టీఆరెస్ కు నేతలకు ఇప్పుడు కొదవలేదు. ఎక్కువైపోయారు కూడా. కానీ హుజురాబాద్ ఓటర్లలో చేనేత సామాజిక వర్గం ఓట్లు అక్కడి గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. దాంతో బాటు బిసి కార్డు తో చక్రం తిప్పుతున్న ఈటల రాజేందర్ కు చెక్ పెట్టాలంటే బలమైన బిసి నేతలు తమ పార్టీలోకి వచ్చి చేరుతున్నారనే సంకేతాలను ప్రజల్లోకి పంపారు కేసీఆర్.
దళితబంధు …
చేనేత వర్గం తరువాత కేసీఆర్ హుజురాబాద్ లో టార్గెట్ చేసిన ఓటర్లు దళితులు. అందుకే దళితబంధు పథకం ఆయన హడావిడిగా రెడీ చేసేస్తున్నారు. దీనికి పైలెట్ ప్రాజెక్ట్ గా హుజురాబాద్ నే ఎంపిక చేసినట్లు ప్రకటించేశారు. ఇలా కులాల వారీగా పని జరుగుతుందని ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఎన్నికల్లో రుజువు అయ్యిందని కేసీఆర్ ఏపీలో జగన్ మార్క్ పాలిటిక్స్ ను ఫాలో అవుతున్నారని అంటున్నారు. హుజురాబాద్ లో తిరుగులేని నేతగా ఉన్న ఈటల గెలుపు రికార్డ్ కు బ్రేక్ వేసి తానేమిటో తెలుగు రాష్ట్రాల్లో చాటాలని స్ట్రేటజీ మార్చిన కేసీఆర్ కొత్త ఫార్ములా ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.